హడలెత్తించిన గిరినాథ్‌ | Andhra bowler took 6 wickets for 29 runs | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన గిరినాథ్‌

Published Wed, Jan 9 2019 12:24 AM | Last Updated on Wed, Jan 9 2019 12:24 AM

Andhra bowler took 6 wickets for 29 runs - Sakshi

ఇండోర్‌: యువ మీడియం పేసర్‌ పారెడ్డి గిరినాథ్‌ రెడ్డి హడలెత్తించడంతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. 10.5 ఓవర్లలో నాలుగు మెయిడిన్‌లు వేసి కేవలం 29 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన గిరినాథ్‌ రెడ్డి మధ్యప్రదేశ్‌ జట్టును 91 పరుగులకే కుప్పకూల్చ డంలో కీలకపాత్ర పోషించాడు. నమన్‌ ఓజా (30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రజత్‌ పాటిదార్‌ (19; 3 ఫోర్లు), శుభం శర్మ (16; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు.

విజయ్‌ కుమార్‌ రెండు వికెట్లు తీయగా... మనీశ్, శశికాంత్‌ ఒక్కోవికెట్‌ పడగొట్టారు. 41 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర ఓవరాల్‌ ఆధిక్యం 239 పరుగులకు చేరింది. ఓపెనర్లు ప్రశాంత్‌ (44; 5 ఫోర్లు), జ్ఞానేశ్వర్‌ (43; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. కరణ్‌ షిండే (45 బ్యాటింగ్‌; 8 ఫోర్లు), శశికాంత్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement