రాయుడు, ఓజా అజేయ సెంచరీలు | Naman Ojha, Ambati Rayudu Slam Tons as India A draw vs Australia A | Sakshi
Sakshi News home page

రాయుడు, ఓజా అజేయ సెంచరీలు

Published Thu, Jul 10 2014 12:46 AM | Last Updated on Fri, May 25 2018 7:45 PM

రాయుడు, ఓజా అజేయ సెంచరీలు - Sakshi

రాయుడు, ఓజా అజేయ సెంచరీలు

ఆసీస్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తొలి టెస్టు డ్రా
 బ్రిస్బేన్: నమన్ ఓజా (127 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), అంబటి రాయుడు (165 బంతుల్లో 100 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్)లు అజేయ సెంచరీలతో రాణించారు. దీంతో ఆస్ట్రేలియా ‘ఎ’తో భారత్ ‘ఎ’ తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.  బుధవారం చివరిరోజు భారత్ ‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో సేయర్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 522/9తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ‘ఎ’ మరో 12 పరుగులు మాత్రమే జోడించి 534 పరుగుల వద్ద ఆలౌటైంది.


 సంక్షిప్త స్కోర్లు: భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 475/9 డిక్లేర్డ్; ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 534 ఆలౌట్; భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 285/5 (నమన్ ఓజా 101 నాటౌట్, రాయుడు 100 నాటౌట్; సేయర్స్ 3/48)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement