ఇమ్రాన్‌ తాహీర్‌ రికార్డు | Imran Tahir scripts World Cup history for South Africa | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 23 2019 6:21 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తాహీర్‌ ఈ ఫీట్‌ సాధించాడు. పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా తాహీర్‌ వేసిన 21 ఓవర్‌ మూడో బంతికి ఇమాముల్‌ హక్‌ను ఔట్‌ చేయడంతో వరల్డ్‌కప్‌లో సఫారీ జట్టు తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇది తాహీర్‌కు 39వ వరల్డ్‌కప్‌ వికెట్‌. దాంతో అలెన్‌ డొనాల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement