ఆసీస్ ఇన్నింగ్స్ సందర్బంగా క్రిస్ వోక్స్ వేసిన 48 ఓవర్ తొలి బంతిని స్మిత్ డిఫెన్స్ ఆడబోయాడు. అది కీపర్ వైపు వెళ్లడంతో నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న స్టార్క్ పరుగు కోసం యత్నించాడు. అయితే ఆలస్యంగా స్పందించిన స్మిత్ అవతలి ఎండ్‌లోకి చేరోలోపే బట్లర్ బంతిని డైరెక్ట్‌గా వికెట్లపైకి విసిరాడు. దీంతో సెంచరీ సాధించకుండానే స్మిత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు.