ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. కరేబియన్ బౌలర్ థామస్ వేసిన 45 ఓవర్ రెండో బంతిని ఫైన్ లెగ్ వైపు భారీ షాట్ ఆడతాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కాట్రెల్ సిక్సర్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఐతే బ్యాలెన్స్ కోల్పోయిన కాట్రెల్ బౌండరీ హద్దును తాకబోతున్నట్లు గమనించి బంతిని లోపలికి విసిరేశాడు. అనంతరం మళ్లీ లైన్ లోపలికి వచ్చి బంతిని అందుకొని ఆశ్చర్యపరిచాడు. కాట్రెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో స్మిత్‌తో సహా ఆసీస్ ప్యాన్స్ షాక్‌కు గురయ్యారు.