ఫోటో షేర్‌ చేసిన భారత స్పిన్నర్‌.. ఈ ఫొటోలో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం.! | Harbhajan Singh posts throwback picture from U19 days with Imran Tahir, Hasan Raza | Sakshi
Sakshi News home page

ఫోటో షేర్‌ చేసిన భారత స్పిన్నర్‌.. ఈ ఫొటోలో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

Published Fri, Dec 10 2021 6:41 PM | Last Updated on Fri, Dec 31 2021 12:53 PM

Harbhajan Singh posts throwback picture from U19 days with Imran Tahir, Hasan Raza - Sakshi

Harbhajan Singh posts throwback picture from U19 days: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పడు అభిమానుల కోసం ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో అండర్‌-19 ప్రపంచకప్‌ నాటి జ్ఞాపకాలను భజ్జీ గుర్తు చేసుకున్నాడు. 1997-98 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్‌-19 ప్రపంచ కప్‌ నాటి ఫొటోను హర్భజన్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలో హర్భజన్‌తో పాటు అండర్‌-19 ప్రపంచకప్‌లో పాల్గొన్న పాక్‌ క్రికెటర్‌లు ఇద్దరు ఉన్నారు.

ఈ ఫొటోకు భజ్జీ పెహచానో టు మానే(అర్ధం తెలుసుకో) అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. అయితే ఈ ఫొటోలో హర్భజన్‌ సింగ్‌ను ఈజీగా గుర్తు పట్టవచ్చు. కానీ మిగతా ఇద్దరు ఆటగాళ్లను గుర్తు పట్టడం కొంచెం కష్టం. అందులో ఒకరు ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న ఇమ్రాన్‌ తహీర్‌, మరొకరు పాక్‌ ఆటగాడు హసన్‌ రాజా. కాగా ఈ ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్తాన్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి. డర్బన్‌లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌పై విజయం సాధించింది.

చదవండి: Virat Kholi: బలమైన జట్టును తయారు చేయడం కష్టం.. కానీ నాశనం చేయడం ఈజీ కదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement