
ఫోటో కర్టసీ: సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌కు తాను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ పేర్కొన్నాడు. కాగా తాహిర్ ఐపీఎల్‌లో సీఎస్‌కే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్‌లో తాహిర్ కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కాగా ఇటీవలే సీఎస్‌కే కలిసిన ఇమ్రాన్ తాహిర్ తన ప్రాక్టీస్‌ను ఆరంభించాడు. స్పిన్ బౌలింగ్‌తో ఎక్కువసేపు నెట్స్‌లో గడిపిన వీడియోనూ సీఎస్‌కే తన ట్విటర్‌లో షేర్ చేసింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియయాలో వైరల్‌గా మారింది. మా లయన్ వచ్చేశాడు.. అంటూ కామెంట్లు పెట్టారు. తాహిర్‌కు పరాశక్తి ఎక్స్‌ప్రెస్ అనే మరో పేరు ఉన్న సంగతి తెలిసిందే.కాగా గతేడాది సీజన్‌లో సీఎస్‌కే దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మొత్తం 14 మ్యాచ్‌లాడిన సీఎస్‌కే 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
చదవండి: సీఎస్‌కేతో ఆసీస్ పేసర్ ఒప్పందం
Sakthi kodu! Parasakthi Express all set to weave his magic this #Summerof2021 #WhistlePodu #Yellove 🦁💛 @ImranTahirSA pic.twitter.com/jhkJ1Osn5u
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2021