లండన్: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తాహీర్ ఈ ఫీట్ సాధించాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో భాగంగా తాహీర్ వేసిన 21 ఓవర్ మూడో బంతికి ఇమాముల్ హక్‌ను ఔట్ చేయడంతో వరల్డ్‌కప్‌లో సఫారీ జట్టు తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇది తాహీర్‌కు 39వ వరల్డ్‌కప్ వికెట్. దాంతో అలెన్ డొనాల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. (ఇక్కడ చదవండి: ఒకే స్కోరు.. ఒకే బౌలర్)
2003 వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్ గుడ్ బై చెప్పిన డొనాల్డ్.. ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌లో 38 వికెట్లు సాధించాడు. తాజాగా ఆ రికార్డును తాహీర్ బ్రేక్ చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో మరో ఓపెనర్ ఫకార్ జమాన్ ఔట్ చేసిన తర్వాత డొనాల్డ్ సరసన చేరిన తాహీర్.. మరి కాసేపటికి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఇమాముల్ హక్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకున్న తాహీర్.. ఇప్పటివరకూ ఈ వరల్డ్‌కప్‌లో 10 వికెట్లను ఖాతాలో వేసుకోవడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment