లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఐపీఎల్‌ విధ్వంసకర వీరులు | Gayle, Du Plessis, Shoaib Malik Among Lanka Premier League 2021 Picks | Sakshi
Sakshi News home page

LPL 2021: లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఐపీఎల్‌ విధ్వంసకర వీరులు

Nov 10 2021 5:38 PM | Updated on Nov 10 2021 5:43 PM

Gayle, Du Plessis, Shoaib Malik Among Lanka Premier League 2021 Picks - Sakshi

Gayle, Du Plessis Among LPL 2021 Picks: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) విధ్వంసకర వీరులు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న లంక ప్రీమియర్‌ లీగ్‌-2021లోనూ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్‌-2021లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించి రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌, పంజాబ్‌ కింగ్స్‌ తరఫున రాణించిన యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌, సీఎస్‌కే తరఫున బౌలింగ్‌లో సత్తా చాటిన ఇమ్రన్‌ తాహిర్‌ తదితర ఆటగాళ్లతో పాటు టీ20 నంబర్‌ వన్‌ బౌలర్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రేజ్‌ షంషి, పాక్‌ స్టార్‌ ఆల్‌రౌండర్లు షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌లు మెరుపు ప్రదర్శనలతో అలరించేందుకు రెడీ అయ్యారు.

వీరే కాకుండా బంగ్లాదేశ్‌ బౌలర్‌ తస్కిన్‌ అహ్మద్‌, విండీస్‌ రోవ్‌మన్‌ పావెల్‌, లంక స్టార్‌ ఆటగాళ్లు ఏంజెలో మాథ్యూస్‌, కుశాల్‌ పెరీరా, అఖిల ధనంజయ, దినేశ్‌ చండీమాల్‌, ధనంజయ డిసిల్వ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు వివిధ ఫ్రాంఛైజీల తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం 5 జట్ల(కొలొంబో స్టార్స్‌, దంబుల్లా జెయింట్స్‌, గాలే గ్లాడియేటర్స్‌, జాఫ్నా కింగ్స్‌, కాండీ వారియర్స్‌)తో జరగనున్న ఈ లీగ్‌ డిసెంబర్‌ 5 నుంచి 23 వరకు జరగనుంది. 
చదవండి: ట్విటర్‌లో సచిన్‌ హవా.. విశ్వవ్యాప్త సర్వేలో మోదీ తర్వాతి స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement