లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ టోర్నీలో దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ దుమ్మురేపాడు. తొలిసారి జరుగుతున్న ఈ టోర్నీలో హ్యాట్రిక్‌తో మెరిసిన తాహిర్.. ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. టోర్నీలో అరుదైన ఫీట్ అందుకున్న తొలి బౌలర్‌గా తాహిర్ రికార్డులకెక్కాడు. వెల్ష్‌ఫైర్‌తో సోమవారం బర్మింగ్‌హమ్ ఫొనిక్స్, వెల్ష్‌ఫైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇమ్రాన్ తాహిర్ మెరుపులతో బర్మింగ్‌హమ్ కీలకదశలో విజయాన్ని అందుకొని టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఖయాస్ అహ్మద్, మాట్ మిల్నెస్, డేవిడ్ పైన్ రూపంలో హ్యాట్రిక్‌ను అందుకున్న తాహిర్ అంతకముందు గ్లెన్ ఫిలిప్స్, లూస్ డూ ప్లూయ్‌లను కూడా ఔట్ చేసి మొత్తం ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హమ్ ఫోనిక్స్ విల్ సిమిద్(65 నాటౌట్), మొయిన్ అలీ(59) మెరుపులతో 100 బంతుల్లో 184 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెల్ష్‌ఫైర్ తాహిర్ దెబ్బకు 74 బంతుల్లోనే 91 పరుగులకు కుప్పకూలింది. ఇయాన్ కాక్‌బైన్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో బర్మింగ్‌హమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ట్రెంట్ రాకెట్స్‌తో సమానంగా ఉన్న బర్మింగ్‌హమ్ మెరుగైన రన్‌రేట్‌తో తొలిస్థానంలో ఉంది. ఇక ట్రెంట్ రాకెట్స్ ఏడో స్థానంలో నిలించింది.
Comments
Please login to add a commentAdd a comment