five wickets
-
చరిత్ర సృష్టించిన హసరంగ.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 25) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అతను.. వరుసగా మూడు వన్డేల్లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లు (16 వికెట్లు) పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ వకార్ యూనిస్ మాత్రమే వన్డేల్లో హ్యాట్రిక్ ఫైఫర్స్ (15 వికెట్లు) సాధించాడు. ఈ టోర్నీలో యూఏఈతో (8-1-24-6) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన హసరంగ.. ఆ తర్వాత ఒమన్‌తో (7.2-2-13-5) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, తాజాగా ఐర్లాండ్‌పై (10-0-79-5) మరోసారి 5 వికెట్ల ఘనత సాధించాడు. హసరంగ చెలరేగడంతో ఐర్లాండ్‌పై శ్రీలంక 133 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, గ్రూప్-బి నుంచి సూపర్ సిక్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓటమితో ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా గ్రూప్-బి నుంచి శ్రీలంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (103) సెంచరీతో కదంతొక్కగా.. సదీర సమరవీర (82) అర్ధసెంచరీతో రాణించాడు. చరిత్ అసలంక (38), ధనంజయ డిసిల్వ (42 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, గెరత్ డెలానీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. హసరంగ (5/79) మహీష్ తీక్షణ (2/28), కసున్ రజిత (1/22), లహీరు కుమార (1/33), దసున్ షనక (1/21) ధాటికి 31 ఓవర్లలో 192 పరుగులకు కుప్పకూలింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంపర్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
#Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వికెట్లతో చెలరేగి లక్నో వెన్నులో వణుకు పుట్టించిన ఆకాశ్ మధ్వాల్ ఇవాళ్టి మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ లక్నోపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చరిత్రకెక్కాడు. ఐపీఎల్ చరిత్రలో 5 పరుగులకే ఐదు వికెట్లు తీసి అత్యంత బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన రెండో బౌలర్‌గా ఆకాశ్ మధ్వాల్ నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. 2009లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున కుంబ్లే ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక ముంబై ఇండియన్స్ తరపున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన ఆటగాడిగా ఆకాశ్ మద్వాల్ నిలిచాడు. ఇంతకముందు లసిత్ మలింగ 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 13 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం అత్యుత్తమంగా ఉంది. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఐపీఎల్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన జాబితాలో ఆకాశ్ మధ్వాల్ తొలి స్థానంలో నిలిచాడు. ఆకాశ్ తర్వాత అంకిత్ రాజ్‌పుత్- KXIP..(5/14 Vs SRH, 2018), వరుణ్ చక్రవర్తి-కేకేఆర్(5/20 Vs DC, 2020), ఉమ్రాన్ మాలిక్-ఎస్ఆర్హెచ్(5/25 Vs GT, 2022) ఉన్నారు. Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం -
రేణుకా సింగ్ కొత్త చరిత్ర .. టీమిండియా తొలి పేసర్‌గా
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ రేణుకా ఠాకూర్ సింగ్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం గ్రూప్-బిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రేణుకా సింగ్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసింది. టి20 వరల్డ్‌కప్‌లో తరపున ఐదు వికెట్ల హాల్ అందుకున్న తొలి భారత మహిళా పేసర్‌గా రికార్డులకెక్కింది. అంతేకాదు వరల్డ్‌కప్‌లో రేణుకా కెరీర్ బెస్ట్ ప్రదర్శన అందుకుంది. నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసింది. తన తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకున్న రేణుకా చివరి ఓవర్లో మరో రెండు వికెట్లను పడగొట్టింది. డంక్లీ, వ్యాట్, అలిస్ క్యాప్సీ, అమీ జోన్స్, బ్రంట్‌ల రూపంలో రేణుకా ఐదు వికెట్ల మార్క్‌ను అందుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్ రేణుకా సింగ్ తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బ్రంట్ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్ తీశారు. Renuka Singh Thakur today: - First Indian pacer to take five-wicket in T20 WC. - Best bowling figure by an Indian in T20 WC. pic.twitter.com/YH8CAtaCNh — Johns. (@CricCrazyJohns) February 18, 2023 చదవండి: భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ -
లియోన్ అనుకుంటే డెబ్యూ బౌలర్ ఇరగదీశాడు
Todd Murphy Five Wicket Haul.. నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో చెలరేగాడు. శ్రీకర్ భరత్ వికెట్ తీయడం ద్వారా మర్ఫీ ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ముందు నుంచి అనుకున్నట్లుగానే ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ నాథన్ లియోన్ కంటే టాడ్ మర్ఫీ అధికంగా ప్రభావం చూపించాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టాడ్ మర్ఫీ వికెట్ల పండగ చేసుకున్నాడు. కాగా మర్ఫీకి ఇదే డెబ్యూ టెస్టు కావడం విశేషం. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసి మర్ఫే ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లతో చెలరేగిన నాలుగో ఆఫ్‌స్పిన్నర్‌గా నిలిచాడు. ఇంతకముందు 1986-87లో పీటర్ టేలర్( ఇంగ్లండ్‌పై 6/78), 2008-09లో జాసన్ క్రేజా( భారత్‌పై 8/215), 2011లో గాలేలో నాథన్ లియోన్(శ్రీలంకపై 5/66) ఉన్నారు. తాజాగా మర్ఫీ వీరి సరసన చేరాడు. చదవండి: Ravindra Jadeja: 'జడేజా చీటింగ్ చేశాడా'.. చూసి మాట్లాడండి! రెండేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ -
IND Vs AUS: స్పిన్‌తో దుమ్ము రేపారు..!
ఆశ్చర్యమేమీ లేదు... భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో విదేశీ బ్యాటర్ల పరిస్థితి ఏమిటో కొత్తగా చెప్పాల్సింది లేదు... అందుకు ఆస్ట్రేలియా కూడా మినహాయింపు కాదని మరోసారి రుజువైంది... అంచనాలకు అనుగుణంగానే భారత బౌలర్లు చెలరేగిపోగా, పిచ్‌ను సందేహిస్తూనే బరిలోకి దిగిన కంగారూ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. దాదాపు ఏడు నెలల తర్వాత టెస్టు ఆడిన జడేజా తన స్పిన్‌తో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా, అశ్విన్ సహకరించాడు. అయితే తొలి 13 బంతుల్లోనే పేసర్లకు 2 వికెట్లు చేజార్చుకొని స్పిన్ రాక ముందే ఆసీస్ దాసోహమంది. అనంతరం దూకుడైన బ్యాటింగ్‌తో రోహిత్ ఆధిపత్యం ప్రదర్శించడంతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీ తొలి రోజును టీమిండియా తమదిగా మార్చుకుంది. రెండో రోజు పిచ్ ఆసీస్ స్పిన్నర్లకు ఎలా సహకరిస్తుందో, భారత బ్యాటర్లు ఎంత భారీ స్కోరు చేస్తారనేది ఆసక్తికరం. నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు భారత్ పక్షాన నిలిచింది. ముందు బౌలింగ్‌లో, ఆపై నిలకడైన బ్యాటింగ్‌తో టీమిండియా ఆటను ముగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. మార్నస్ లబుషేన్ (123 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (5/47) ఐదు వికెట్లతో చెలరేగగా, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (69 బంతుల్లో 56 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ మరో 100 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. కీలక భాగస్వామ్యం... టాస్ గెలిచిన ప్రయోజనాన్ని ఆస్ట్రేలియా పొందలేకపోయింది. సిరాజ్ తన తొలి బంతికే ఖాజా (1)ను ఎల్బీగా అవుట్ చేశాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా...రివ్యూలో భారత్ ఫలితం సాధించింది. ఆ తర్వాత షమీ వేసిన చక్కటి బంతి వార్నర్ (1) స్టంప్స్‌ను ఎగరగొట్టింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే జడేజాను భారత్ బౌలింగ్‌కు దించింది. ఇలాంటి స్థితిలో లబుషేన్, స్టీవ్ స్మిత్ (107 బంతుల్లో 37; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ కొన్ని చక్కటి షాట్లతో వీరిద్దరు స్కోరు బోర్డును నడిపించారు. లంచ్ సమయానికి 76/2 స్కోరుతో ఆసీస్ కోలుకున్నట్లుగా అనిపించింది. టపటపా... విరామం తర్వాత జడేజా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కంగారూల పని పట్టాడు. భరత్ చక్కటి స్టంపింగ్‌కు లబుషేన్ వెనుదిరగ్గా, రెన్షా (0) తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. లబుషేన్, స్మిత్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అక్షర్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన స్మిత్‌ను కూడా జడేజా బౌల్డ్ చేయడంతో ఆసీస్ పరిస్థితి మరింత దిగజారింది. దాంతో అలెక్స్ క్యారీ (33 బంతుల్లో 36; 7 ఫోర్లు), పీటర్ హ్యాండ్స్కోంబ్ (84 బంతుల్లో 31; 4 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఎదురుదాడికి దిగిన క్యారీ వరుసగా స్వీప్, రివర్స్ స్వీప్‌షాట్లతో బౌండరీలు రాబట్టాడు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో అదే రివర్స్‌స్వీప్‌కు ప్రయత్నించి బౌల్డ్ కావడంతో ఆరో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. హ్యాండ్స్కోంబ్, క్యారీ 11.2 ఓవర్లలో 53 పరుగులు జోడించడం విశేషం. ‘టీ’ తర్వాత హ్యాండ్స్‌కోంబ్‌ను జడేజా అవుట్ చేయడంతో 200 పరుగుల స్కోరుకు ఆసీస్ చాలా దూరంలో ఆగిపోయింది. ఆ జట్టు 15 పరుగుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. రోహిత్ జోరు... తొలి రోజు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన రోహిత్ దానిని తన బ్యాటింగ్‌లో ప్రదర్శించాడు. కమిన్స్ వేసిన మొదటి ఓవర్లోనే 3 ఫోర్లు కొట్టిన అతను, ఆ తర్వాత కమిన్స్ ఓవర్లోనే మరో 2 ఫోర్లు బాదాడు. ఆట ముగిసే వరకు భారత కెప్టెన్ అదే ధాటిని కొనసాగించగా, మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ (71 బంతుల్లో 20; 1 ఫోర్) చాలా జాగ్రత్తగా ఆడాడు. తన 55వ బంతికి గానీ రాహుల్ ఫోర్ కొట్టలేకపోయా డు. లయన్ బౌలింగ్‌లో బౌండరీతో 66 బంతుల్లోనే రోహిత్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే చివర్లో రాహుల్‌ను వెనక్కి పంపి మర్ఫీ కెరీర్లో తొలి వికెట్ తీయగా, ఆసీస్‌కు కాస్త ఊరట లభించింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (బి) షమీ 1; ఖాజా (ఎల్బీ) (బి) సిరాజ్ 1; లబుషేన్ (స్టంప్డ్) భరత్ (బి) జడేజా 49; స్మిత్ (బి) జడేజా 37; రెన్షా (ఎల్బీ) (బి) జడేజా 0; హ్యాండ్స్కోంబ్ (ఎల్బీ) (బి) జడేజా 31; క్యారీ (బి) అశ్విన్ 36; కమిన్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 6; మర్ఫీ (ఎల్బీ) (బి) జడేజా 0; లయన్ (నాటౌట్) 0; బోలండ్ (బి) అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (63.5 ఓవర్లలో ఆలౌట్) 177. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–84, 4–84, 5–109, 6–162, 7–172, 8–173, 9–176, 10–177. బౌలింగ్: షమీ 9–4–18–1, సిరాజ్ 7–3–30–1, జడేజా 22–8–47–5, అక్షర్ 10–3–28–0, అశ్విన్ 15.5–2–42–3. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 56; రాహుల్ (సి) అండ్ (బి) మర్ఫీ 20; అశ్విన్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (24 ఓవర్లలో వికెట్ నష్టానికి) 77. వికెట్ల పతనం: 1–76. బౌలింగ్: కమిన్స్ 4–1–27–0, బోలండ్ 3–1–4–0, లయన్ 10–3–33–0, మర్ఫీ 7–0–13–1. టెస్టులకు ‘శ్రీకారం’ దాదాపు 15 నెలల క్రితం... కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో కోన శ్రీకర్ భరత్ సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. రెండు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌తో పాటు బంతి అనూహ్యంగా మలుపులు తిరుగుతున్న పిచ్‌పై అతని అద్భుత కీపింగ్ అందరినీ ఆకట్టుకుంది. దురదృష్టవశాత్తూ క్రికెట్ గణాంకాల్లో సబ్‌స్టిట్యూట్ ప్రదర్శనకు చోటుండదు. ఎట్టకేలకు గురువారం భరత్ టెస్టు క్రికెట్ ఆడిన 305వ భారత క్రికెటర్‌గా మైదానంలోకి అడుగు పెట్టాడు. సరిగ్గా పదేళ్ల క్రితం తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అతను ఇప్పుడు టీమిండియా సభ్యుడయ్యాడు. రంజీ ట్రోఫీలో, భారత ‘ఎ’ జట్టు రెగ్యులర్‌గా అనేక సిరీస్‌లు ఆడిన తర్వాత టెస్టు బరిలోకి దిగిన భరత్ తొలి రోజు ఆటలోనే తనదైన ముద్ర వేశాడు. చురుకైన కదలికలతో అతను లబుషేన్‌ను మెరుపు వేగంతో స్టంపౌట్ చేసిన క్షణమే ఆటను మలుపు తిప్పింది. ఆంధ్ర క్రికెట్లో వివిధ వయో విభాగాల్లో ప్రదర్శన ద్వారా పైకి ఎదిగిన భరత్‌కు దేశవాళీ క్రికెట్లో గుర్తింపు తెచ్చుకునేందుకు కొంత సమయం పట్టింది. 86 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ట్రిపుల్ సెంచరీ సహా 4707 పరుగులు చేసిన భరత్ 2021 ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. ఢిల్లీపై మ్యాచ్‌లో చివరి బంతికి సిక్స్ కొట్టి ఆర్సీబీని గెలిపించడం అతని దూకుడైన ఆటను పరిచయం చేసింది. అప్పటినుంచి టీమిండియాలో రెగ్యులర్‌గా మారే అవకాశం ఉన్న కీపర్‌గా అతని పేరుపై పలు మార్లు సెలక్షన్ సమావేశాల్లో చర్చ జరిగింది. సాహా రిటైరైతే అతనికి ప్రత్యామ్నాయంగా భరత్ ఖాయమని అర్థమైంది. గతంలోనూ సీనియర్ టీమ్‌కు ఎంపికైనా, భరత్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. వికెట్ కీపర్ ఎమ్మెస్కే ప్రసాద్ (6 టెస్టులు) తర్వాత భారత టెస్టు జట్టుకు ఎంపికైన ఆంధ్ర ఆటగాడిగా భరత్ నిలిచాడు. 2018లో భారత జట్టులోకి ఎంపికయ్యే సమయానికి హనుమ విహారి ఆంధ్ర తరఫున ఆడుతున్నా...అంతకు ముందే 6 సీజన్లు అతను హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డే, టి20 జట్లలో ఇప్పటికే సభ్యుడైన సూర్యకుమార్ యాదవ్ కూడా నాగ్‌పూర్‌లో టెస్టులో అరంగేట్రం చేశాడు. మున్ముందు కోన భరత్ మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని ఆశిద్దాం. ‘ఆస్ట్రేలియాతో టెస్టులో అరంగేట్రం చేస్తున్న మన కోన భరత్‌కు నా హార్దికాభినందనలు. తెలుగు జెండా మరింత ఎత్తున రెపరెపలాడు తోంది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. -
అరంగేట్రంలోనే అదుర్స్! ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే.. కానీ పాపం..
County Championship 2022: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్‌షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ద్వారా కౌంటీల్లో అడుగు పెట్టిన సైనీ.. వార్విక్షైర్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. క్రిస్ బెంజమిన్, డాన్ మూస్లే, మిచెల్ బర్గ్స్ , హెన్రీ బ్రూక్స్, క్రెయిగ్ మిల్స్‌లను అవుట్ చేశాడు. Five wickets on debut: @navdeepsaini96 🏎 pic.twitter.com/6wzYjE8N1d — Kent Cricket (@KentCricket) July 20, 2022 ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా సహా పలువురు టీమిండియా క్రికెటర్లు కౌంటీ చాంపియన్‌షిప్-2022లో ఆడుతున్న విషయం తెలిసిందే. పుజారా ససెక్స్‌కు, ఉమేశ్ యాదవ్ మిడిల్సెక్స్ తరఫున, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్ తరఫున ఆడుతున్నారు. కాగా వాషింగ్టన్ సుందర్ సైతం తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక సైనీ కెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత కెంట్కు ఆడుతున్న ఘనత నవదీప్ సైనీకే దక్కింది. ఇదిలా ఉంటే.. రాయల్ వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా కృనాల్ పాండ్యా వార్విక్‌షైర్‌కు ఆడనున్నాడు. పాపం.. బౌలర్లు రాణించినా.. మ్యాచ్ విషయానికొస్తే.. జూలై 19న కెంట్‌తో ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వార్విక్షైర్ తొలి ఇన్నింగ్స్‌ను 225 పరుగుల వద్ద ముగించింది. కెంట్ బౌలర్లలో సైనీ ఐదు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ రెండు, మిల్న్స్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, బ్యాటర్లు విఫలం కావడంతో 165 పరుగులకే కెంట్ కుప్పకూలింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట ఆలస్యమైంది. చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! -
కౌంటీల్లో వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే అరంగేట్రం
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కౌంటీ క్రికెట్లో అదిరిపోయే అరంగేట్రం ఇచ్చాడు. లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సుందర్ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. నార్తంప్టన్‌షైర్‌తో మ్యాచ్‌లో సుందర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. తద్వారా కౌంటీ క్రికెట్లో సుందర్ ఒక అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కౌంటీల్లో డెబ్యూ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా సుందర్ రికార్డులకెక్కాడు. ఆటలో తొలిరోజే నాలుగు వికెట్లు తీసిన సుందర్.. రెండోరోజు ఆటలో ఒక వికెట్ తీసి ఓవరాల్‌గా 22 ఓవర్లలో 76 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. సుందర్‌కు తోడుగా లూక్ వుడ్ 3, విల్ విలియమ్స్ రెండు వికెట్లు తీయడంతో నార్తంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన లంకాషైర్ లంచ్ విరామం సమయానికి రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్-2022లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన సుందర్ లీగ్ మధ్యలో గాయపడ్డాడు. అయితే టీ20 స్పెషలిస్టుగా పేరుందిన సుందర్‌కు గాయం నుంచి కోలుకున్న తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి తిరిగి భారత జట్టులోకి రావాలని సుందర్ భావిస్తున్నాడు. ఇక సుందర్ టీమిండియా తరపున 4 టెస్టులు, 4 వన్డేలు, 31 టి20లు ఆడాడు. WASHI HAS FIVE!! 🖐️🌟@Sundarwashi5 becomes just the seventh @lancscricket player to take a five-for on debut! 👏 McManus caught sweeping on the boundary for 61. 226-9 (75.2) 🌹 #RedRoseTogether pic.twitter.com/sQojvSTPLs — Lancashire Cricket (@lancscricket) July 20, 2022 చదవండి: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. 4 వికెట్లతో..! -
ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఉమ్రాన్ మాలిక్ కొత్త చరిత్ర
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగాడు. ఏకంగా నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేసిన ఉమ్రాన్ ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. ఉత్కంఠభరిత పోరులో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడినప్పటికి తన ప్రదర్శనతో ఉమ్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఉమ్రాన్ మాలిక్ (4-0-25-5) తన ఐపీఎల్ కెరీర్లోనే బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఉమ్రాన్ మాలిక్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. PC: IPL Twitter ►ఐపీఎల్లో ఐదు వికెట్ల ఫీట్ అందుకున్న ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఉమ్రాన్ కంటే ముందు అంకిత్ రాజ్‌పుత్(5/14 వర్సెస్ ఎస్ఆర్హెచ్, 2018), వరుణ్ చక్రవర్తి(5/20 వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, 2020), హర్షల్ పటేల్(5/27 వర్సెస్ ముంబై ఇండియన్స్, 2021), అర్ష్‌దీప్ సింగ్(5/32 వర్సెస్ రాజస్తాన్ రాయల్స్, 2021) ఉన్నారు. ►ఎస్ఆర్హెచ్ తరపున ఐపీఎల్లో ఐదు వికెట్ల ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకముందు భువనేశ్వర్ కుమార్( 2017లో పంజాబ్ కింగ్స్‌పై, 5/18) ఉన్నాడు. ►ఎస్ఆర్హెచ్ తరపున బౌలింగ్‌లో బెస్ట్ ఫిగర్స్ అందుకున్న జాబితాలోనూ ఉమ్రాన్ చోటు దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార, ఉమ్రాన మాలిక్, మహ్మద్ నబీ ఉన్నారు. ► ఐపీఎల్లో ఒక బౌలర్ నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేయడం ఇది మూడోసారి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇంతకముందు లసిత్ మలింగ 2011లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో, సిద్దార్థ్ త్రివేది 2012లో ఆర్సీబీతో మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేశారు. He may not have ended on a winning side tonight but Umran Malik put on an outstanding display to pick 5⃣ wickets and bagged the Player of the Match award. 👍 👍 Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/AlOEPvruKx — IndianPremierLeague (@IPL) April 27, 2022 -
ఐపీఎల్ చరిత్రలో చహల్ కొత్త రికార్డు..
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ సంచలనం సృష్టించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీయడంతో పాటు ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసి కేకేఆర్‌ను చావుదెబ్బ కొట్టాడు. ముందుగా వెంకటేశ్ అయ్యర్‌ను తొలి బంతికే స్టంప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, పాట్ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో చహల్ది 21వ హ్యాట్రిక్ కాగా.. రాజస్తాన్ రాయల్స్ తరపున హ్యాట్రిక్ సాధించిన ఐదో బౌలర్‌గా చహల్ నిలిచాడు. ఇంతకముందు రాజస్తాన్ నుంచి అజిత్ చండీలా, ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్, శ్రేయాస్ గోపాల్ ఈ ఘనత సాధించారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన 25 బౌలర్‌గా చహల్ నిలచాడు. అయితే ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా చహల్ చరిత్ర సృష్టించాడు.ఓవరాల్‌గా కేకేఆర్‌తో మ్యాచ్‌లో చహల్ (4-0-40-5)తో ఐపీఎల్ కెరీర్లో ఉత్తమ గణాంకాలు సాధించాడు. -
జడేజా సరికొత్త రికార్డు.. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా
టీమిండియా, శ్రీలంక మధ్య జరుగతున్న తొలి టెస్టు రవీంద్ర టెస్టుగా మారిపోయింది. బ్యాటింగ్‌లో 150కి పైగా పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లతో మెరిసి ఆల్‌రౌండర్ అనే పదానికి మరోసారి అర్థం చెప్పాడు. స్వదేశీ పిచ్‌లపై తన బౌలింగ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. లంకతో తొలి టెస్టులో ముందు బ్యాటింగ్‌లో 228 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 175 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో 13 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తద్వారా జడేజా టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అవేంటో పరిశీలిద్దాం. ►ఒకే టెస్టు మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు.. ఐదు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా .. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ►ఇంతకముందు టీమిండియా తరపున వినూ మాన్కడ్ 1952లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బ్యాటింగ్‌లో 184 పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీశాడు. ►1962లో వెస్టిండీస్‌తో టెస్టులో మరో భారత క్రికెటర్ పాలి ఉమ్రిగర్ 172 పరుగులు నాటౌట్.. ఐదు వికెట్లు తీశాడు ►ఇక ఓవరాల్‌గా జడేజా ఆరో స్థానంలో ఉండగా.. వినూ మాన్కడ్, డెనిస్ అట్కిన్సన్, పాలి ఉమ్రిగర్, గ్యారీ సోబర్స్, ముస్తాక్ మహ్మద్ ఉన్నారు. ►జడేజా ఆఖరుసారి టెస్టుల్లో 2017లో ఐదు వికెట్లు తీశాడు. అప్పుడు ప్రత్యర్థి శ్రీలంకనే కావడం విశేషం. కొలంబో వేదికగా జరిగిన ఆ టెస్టులో జడేజా 152 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తాజాగా మరోసారి శ్రీలంకపై ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. ►జడేజాకు టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది పదోసారి. ►ఇక టెస్టులో టీమిండియా శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం పదోసారి కావడం విశేషం. A 5⃣-wicket haul for @imjadeja as #TeamIndia wrap Sri Lanka innings for 174 🔥🔥 Follow the match ▶️ https://t.co/XaUgOQVg3O#INDvSL | @Paytm pic.twitter.com/iJoGxRr6cY — BCCI (@BCCI) March 6, 2022 -
5 వికెట్లతో చెలరేగాడు.. జట్టును గెలిపించాడు
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ఓపెనర్లు హెల్స్, స్టిర్లింగ్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెల్స్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మున్రో సిక్సర్ల వర్షం కురిపించాడు. అదే విధంగా స్టిర్లింగ్ కూడా ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక 58 పరుగులు చేసిన స్టిర్లింగ్ నవాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత ఆజామ్ ఖాన్, మున్రో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మున్రో కేవలం 39 బంతుల్లో 72 పరుగులు చేయగా, ఆజామ్ ఖాన్ 35 బంతుల్లో 65 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇస్లామాబాద్ యునైటెడ్ 229 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ 185 పరుగులకే ఆలౌటైంది. ఇస్లామాబాద్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టి గ్లాడియేటర్స్‌ను దెబ్బతీయగా, హసన్ అలీ,మహ్మద్ వసీం చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక గ్లాడియేటర్స్ బ్యాటర్లలో అసన్ అలీ(50),నవాజ్ (47) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: నాపై ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా: శిఖర్ ధావన్ -
బుమ్రా అరుదైన ఘనత.. కపిల్, పఠాన్ల సరసన
Seventh Five Wicket Haul For Bumrah 27 Test Joins Elite List.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అరుదైన రికార్డు అందుకున్నాడు. కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించాడు. కేప్‌టౌన్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో టీమిండియా బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్ 2010-11లో ఏడు వికెట్లు తీయగా.. అదే మ్యాచ్‌లో శ్రీశాంత్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక బుమ్రా టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే రావడం విశేషం. ఇక 27 టెస్టుల్లో అత్యధికంగా ఏడుసార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించిన బుమ్రా కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్ల సరసన నిలిచాడు. చదవండి: Virat Kohli: సెంచరీ మిస్సయ్యాడు.. అయినా రికార్డు అందుకున్నాడు ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(5/42)తో పాటు ఉమేశ్ యాదవ్(2/64), షమీ(2/39), శార్ధూల్ ఠాకూర్(1/37) రాణించారు. ఫలితంగా టీమిండియాకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీగన్ పీటర్సన్(72) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను కెప్టెన్ కోహ్లి, పుజారా ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను 57/2 స్కోర్ వద్ద ముగించారు. కోహ్లి 14 పరుగులు, పుజారా 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్(7)ను రబాడ, కేఎల్ రాహుల్(10)ను జన్సెన్ పెవిలియన్‌కు పంపారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 70 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్.. A five-wicket haul for Jasprit Bumrah and South Africa's innings is wrapped up for 210 👏🏻 India lead by a slender 13 runs. Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE1P6t pic.twitter.com/cmqKWckoIX — ICC (@ICC) January 12, 2022 -
Mohammed Shami: అంతా మా నాన్న వల్లే.. షమీ భావోద్వేగం
Mohammed Shami Emotional Comments: ‘‘నేను ఓ పల్లెటూరి నుంచి వచ్చాను. అక్కడ ఇప్పటికీ సరైన సౌకర్యాలు లేవు. అలాంటి చోట నుంచి ఇక్కడి దాకా వచ్చానంటే ఈ క్రెడిట్ మా నాన్నదే. క్రికెట్ ప్రాక్టీసు కోసం మా గ్రామం నుంచి సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. మా నాన్న నా వెంట వచ్చేవారు. నా సోదరుడు నాకు అండగా నిలబడ్డారు. ఎన్నెన్నో కష్టాలు, పోరాటాల తర్వాతే ఇప్పుడున్న స్థితికి చేరుకున్నాను. నాకు దక్కుతున్న ప్రశంసలు అందుకునేందుకు మా నాన్నే అర్హులు. నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నానంటే నా తండ్రి, సోదరుడి ప్రోత్సాహమే కారణం. నేను సాధించిన విజయాల ఘనత వారికే చెందుతుంది’’ అంటూ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా 16 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 44 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా తన కెరీర్లో ఆరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ప్రొటిస్ జట్టును 197 పరుగులకే ఆలౌట్ చేసి భారత్‌కు ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక.. టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న 11వ బౌలర్‌గా షమీ నిలిచాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్వేగానికి లోనైన షమీ.. తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ పైవిధంగా స్పందించాడు. తన ఎదుగుదలలో తండ్రి, సోదరుడు ముఖ్య భూమిక పోషించారని చెప్పుకొచ్చాడు. చదవండి: Aus Vs Eng: మరీ ఘోరంగా 92 పరుగులకే ఆలౌట్ అవుతారా! 68కి కూడా మైఖేల్..! 200 Test wickets 💪 A terrific 5-wicket haul 👌 An emotional celebration 👍#TeamIndia pacer @MdShami11 chats up with Bowling Coach Paras Mhambrey after a memorable outing on Day 3 in Centurion. 👏👏 - By @28anand Watch the full interview 🎥 🔽 #SAvIND https://t.co/likiJKi6o5 pic.twitter.com/zIsQODjY6d — BCCI (@BCCI) December 29, 2021 -
సూపర్ షమీ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 5 వికెట్లతో సత్తా చాటాడు. తన పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. షమీ బంతులకు ప్రొటీస్ బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇక షమీకి టెస్టు కెరీర్లో ఐదు వికెట్ల హాల్ అందుకోవడం ఆరోసారి. ఈ ఆరింటిలో రెండుసార్లు(తాజా దానితో కలిపి) రెండుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. మిగిలిన నాలుగుసార్లు రెండో ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించడం విశేషం. ఈ క్రమంలోనే మహ్మద్ షమీ టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. చదవండి: IND Vs SA 1st Test: బుమ్రాకు గాయం.. టీమిండియా ఆందోళన ►200 వికెట్ల మార్క్‌ను చేరుకోవడానికి షమీకి 55 టెస్టులు అవసరం అయ్యాయి. 50 టెస్టుల్లో కపిల్ దేవ్ 200 వికెట్ల మార్క్ సాధించి తొలి స్థానంలో నిలవగా.. జగవల్ శ్రీనాథ్(54 టెస్టుల్లో) రెండో స్థానం, షమీ(55 టెస్టులు) మూడో స్థానం, జహీర్‌ఖాన్, ఇషాంత్ శర్మలు సంయుక్తంగా 63 టెస్టులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ►ఇక టీమిండియా తరపున టెస్టుల్లో 200 వికెట్ల మార్క్‌ను అందుకోవడానికి షమీకి 9896 బంతులు అవసరమయ్యాయి. ఈ జాబితాలో షమీనే నెంబర్‌వన్ కావడం విశేషం. రెండోస్థానంలో అశ్విన్(10248 బంతులు), కపిల్ దేవ్(11066 బంతులు) మూడోస్థానం, రవీంద్ర జడేజా(11989 బంతులు) నాలుగో స్థానంలో ఉన్నారు. చదవండి: Quinton De Kock: ఎంత ఔటైతే మాత్రం ఇంత కోపం అవసరమా డికాక్.. -
Ashes Series: డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ అదుర్స్.. 127 ఏళ్ల తర్వాత
Pat Cummins First Captian Take 5 Wickets Haul In Ashes Test Since 1982.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ డెబ్యూ కెప్టెన్సీలోనే అదరగొట్టాడు. టిమ్ పైన్ స్థానంలో కొత్త కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్ యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తంగా 13.1 ఓవర్లలో 38 పరుగులు.. మూడు మెయిడెన్లతో ఐదు వికెట్లు తీశాడు. ఈ ఐదు వికెట్లలో హసీబ్ హమీద్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్లు ఉన్నారు. తాజా ప్రదర్శనతో కమిన్స్ డెబ్యూ టెస్టు కెప్టెన్‌గా రెండు రికార్డులను బద్దలుకొట్టాడు. ►డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ తన తొలి టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం ఆసీస్ క్రికెట్ చరిత్రలో రెండోసారి. ఇంతకముందు జార్జ్ గిఫిన్ 1894లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్ డెబ్యూ కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే ఐదు వికెట్లు తీశాడు.మెల్బోర్న్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. మళ్లీ 127 ఏళ్ల తర్వాత పాట్ కమిన్స్ ఆ ఫీట్‌ను రిపీట్ చేయడం విశేషం. ►ఇక యాషెస్ సిరీస్ పరంగా చూసుకుంటే డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ ఐదు వికెట్ల ఘనత అందుకోవడం 1982 తర్వాత మళ్లీ ఇప్పుడే. 1982 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ డెబ్యూ కెప్టెన్‌గా బాబ్ విల్లీస్ ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు ఘనత సాధించాడు. చదవండి: Mitchell Starc: 85 ఏళ్ల రికార్డును తిరగరాసిన మిచెల్ స్టార్క్ Aye aye, skipper! Pat Cummins' first Test wicket as captain is the dangerous Ben Stokes! #OhWhatAFeeling@Toyota_Aus | #Ashes pic.twitter.com/AKjsV0qK5c — cricket.com.au (@cricketcomau) December 8, 2021 -
ఒకే ఒక్కడు 6 వికెట్లు.. భారత్‌పై అరుదైన రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్..
First New Zealand spinner to take a five wicket haul in 1st Innings of a Test in India: టెస్ట్‌ల్లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్‌లను వరుస బంతుల్లో ఔట్ చేయడంతో ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా తన కేరిర్‌లో ఇది మూడో 5 ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. అయితే ఈ మూడు 5 వికెట్ల హాల్ కూడా ఆసియాలోనే సాధించాడు. అంతకు ముందు 2012లో హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ 4 వికెట్లు సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 6వికెట్లు కోల్పోతే.. మొత్తం ఆ 6 వికెట్లు కూడా అజాజ్ పటేల్ తీసినవే కావడం గమనర్హం. చదవండి: Rohit Sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ! -
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు...
చిట్టగాంగ్: బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆట మూడో రోజు బౌలర్లు చెలరేగడంతో ఆదివారం ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. దాంతో ఇరు జట్లను గెలుపు ఊరిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 4 వికెట్లకు 39 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (12 బ్యాటింగ్; 1 ఫోర్), యాసిర్ అలీ (8 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 145/0తో ఆటను ఆరంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 115.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ను తైజుల్ ఇస్లామ్ (7/116) దెబ్బ తీశాడు. మూడో రోజు తొలి ఓవర్లోనే అతడు అబ్దుల్లా షఫీక్ (52; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్ అలీ (0) వికెట్లను తీశాడు. ఓవర్‌నైట్ బ్యాటర్ ఆబిద్ అలీ (133; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీని పూర్తి చేశాడు. ఆబిద్ అలీని కూడా తైజుల్ అవుట్ చేయడంతో పాకిస్తాన్ పతనం ఆరంభమైంది. చదవండి: IND Vs NZ 1st Test: విజయం ఊరిస్తోంది! -
వారెవ్వా అక్షర్ పటేల్.. టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో బౌలర్‌గా
Axar Patel Was 3rd Bowler In Test Cricket history.. టీమిండియా లెగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అక్షర్ పటేల్ 34 ఓవర్లు వేసి 6 మెయిడెన్లు సహా 62 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టామ్ లాథమ్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండర్, సౌథీ రూపంలో అక్షర్ 5 వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో నాలుగుసార్లు ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. చదవండి: Ashwin Vs Nitin Menon: అంపైర్‌తో అశ్విన్ గొడవ.. అది మనసులో పెట్టుకొనేనా? ► కాగా అక్షర్ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి. తొలి నాలుగు టెస్టుల్లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన జాబితాలో టామ్ రిచర్డ్సన్, రోడ్ని హగ్‌తో కలిసి అక్షర్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఉన్న చార్లి టర్నర్ తొలి నాలుగు టెస్టుల్లో ఆరు సార్లు ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఇక వెర్నన్ ఫిలాండర్, ఫ్రెడ్ స్పోపోర్త్, సిడ్ బార్నెస్, నిక్ కుక్‌లు నాలుగేసి సార్లు ఐదు వికెట్ల మార్క్ సాధించారు. ► ఇంకో విశేషమేమిటంటే డెబ్యూ టెస్టు నుంచి తాను ఆడిన నాలుగు టెస్టుల్లో అక్షర్ ప్రతీ టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకముందు ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. చార్లీ టర్నర్ (1887లో డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు), టామ్ రిచర్డ్సన్(1893 డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు) ఉన్నారు. తాజాగా అక్షర్ పటేల్ వీరి సరసన నిలిచాడు. చదవండి: Tom Latham Stump Out: రెండో బ్యాట్స్‌మన్‌గా టామ్ లాథమ్! 30 ఏళ్ల తర్వాత.. ► ఇక టీమిండియా తరపున అక్షర్ పటేల్ కంటే ముందు ఎల్. శివరామకృష్ణన్, నరేంద్ర హిర్వాణిలు తొలి నాలుగు టెస్టుల్లో మూడేసి సార్లు ఐదు వికెట్ల మార్క్‌ను సాధించారు. కాగా ఈ విషయంలో మాత్రం అక్షర్ పటేల్ టీమిండియా తరపున తొలి స్థానంలో నిలిచాడు. -
70 ఏళ్లలో ఆ ఘనత సాధించిన బౌలర్ అతనొక్కడే..
లండన్: స్వింగ్ కింగ్, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన ఆండర్సన్.. గడిచిన 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన(39 ఏళ్ల 14 రోజులు) పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లార్డ్స్ టెస్టు తొలి రోజు రోహిత్ శర్మ, పుజారాలను ఔట్ చేసిన అండర్సన్.. రెండో రోజు రహానే, ఇషాంత్ శర్మ, బుమ్రా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యంత పెద్ద వయసులో 5 వికెట్లు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు జెఫ్ చబ్ పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో చబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అప్పటికి అతడి వయసు 40 ఏళ్ల 86 రోజులు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అండర్సన్ 39 ఏళ్ల 14 రోజుల వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం అండర్సన్‌కు ఇది 31వ సారి. ప్రస్తుత ఆటగాళ్లలో అశ్విన్ (30), స్టువర్ట్ బ్రాడ్ (18), షకిబుల్ హాసన్ (18), నాథన్ లియోన్ (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, అండర్సన్‌కు లార్డ్స్ మైదానంలో భారత్‌పై మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శనతో మొత్తంగా 33 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా అండర్సన్ 164 టెస్టుల్లో 626 వికెట్లుతో మూడో అత్యధిక టెస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆండర్సన్(5/62) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్(2/34) దెబ్బతీయగా, బర్న్స్(49), రూట్(48 బ్యాటింగ్) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. -
దుమ్మురేపిన తాహిర్; హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్లు
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ టోర్నీలో దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ దుమ్మురేపాడు. తొలిసారి జరుగుతున్న ఈ టోర్నీలో హ్యాట్రిక్‌తో మెరిసిన తాహిర్.. ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. టోర్నీలో అరుదైన ఫీట్ అందుకున్న తొలి బౌలర్‌గా తాహిర్ రికార్డులకెక్కాడు. వెల్ష్‌ఫైర్‌తో సోమవారం బర్మింగ్హమ్ ఫొనిక్స్, వెల్ష్‌ఫైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇమ్రాన్ తాహిర్ మెరుపులతో బర్మింగ్హమ్ కీలకదశలో విజయాన్ని అందుకొని టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఖయాస్ అహ్మద్, మాట్ మిల్నెస్, డేవిడ్ పైన్ రూపంలో హ్యాట్రిక్‌ను అందుకున్న తాహిర్ అంతకముందు గ్లెన్ ఫిలిప్స్, లూస్ డూ ప్లూయ్లను కూడా ఔట్ చేసి మొత్తం ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ విల్ సిమిద్(65 నాటౌట్), మొయిన్ అలీ(59) మెరుపులతో 100 బంతుల్లో 184 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెల్ష్‌ఫైర్ తాహిర్ దెబ్బకు 74 బంతుల్లోనే 91 పరుగులకు కుప్పకూలింది. ఇయాన్ కాక్బైన్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో బర్మింగ్హమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ట్రెంట్ రాకెట్స్‌తో సమానంగా ఉన్న బర్మింగ్హమ్ మెరుగైన రన్‌రేట్‌తో తొలిస్థానంలో ఉంది. ఇక ట్రెంట్ రాకెట్స్ ఏడో స్థానంలో నిలించింది. -
రషీద్ పాంచ్ పటాకా.. టాప్‌లో లాహోర్ ఖలందర్స్
అబుదాబి: యూఏఈ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 6)లో లాహోర్ ఖలందర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌పై బుధవారం థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన లాహోర్ గురువారం పెషావర్ జాల్మిపై 10 పరుగుల తేడాతో విజయం సాధించి మొత్తంగా 6 మ్యాచ్‌లాడి 5 విజయాలు.. ఒక ఓటమితో 10 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. గత మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈసారి బౌలింగ్‌లో అదరగొట్టాడు. మ్యాచ్‌లో ఐదు కీలక వికెట్లు తీసి మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పీఎస్ఎల్లో ఐదు వికెట్లు తీయడం రషీద్‌కు ఇదే తొలిసారి. రషీద్ ఐదు వికెట్లు తీసిన వీడియోనూ పీఎస్ఎల్ తన ట్విటర్లో షేర్ చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 25 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో టిమ్ డేవిడ్ (36 బంతుల్లో 64, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), బెన్ డంక్(33 బంతుల్లో 48, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. చివర్లో జేమ్స్ ఫాల్కనర్ 7 బంతుల్లో 22 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 160 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. షోయబ్ మాలిక్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు ఎవరు పెద్దగా రాణించలేదు. చదవండి: దంచికొట్టిన రషీద్ ఖాన్.. ఆఖరి బంతికి విజయం 5️⃣ 🌟@rashidkhan_19 posted his career best figures in franchise cricket on a magical night of bowling. #HBLPSL6 | #MatchDikhao | #PZvLQ pic.twitter.com/rdkNi40jyB — PakistanSuperLeague (@thePSLt20) June 10, 2021 -
మొహమ్మద్ రఫీ విజృంభణ
సాక్షి, ఒంగోలు: ఆంధ్ర జట్టు బౌలర్లు మళ్లీ మెరిశారు. రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా కేరళతో ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో సోమవారం ఆరంభమైన మ్యాచ్‌లో తొలి రోజు ఆంధ్ర జట్టు పైచేయి సాధించింది. ఆంధ్ర బౌలర్లు మొహమ్మద్ రఫీ (5/62)తోపాటు పృథ్వీ రాజ్ (3/37), శశికాంత్ (2/38) హడలెత్తించడంతో కేరళ తమ తొలి ఇన్నింగ్స్ లో 49.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. రంజీ అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన తొమ్మిదో ఆంధ్ర బౌలర్‌గా రఫీ గుర్తింపు పొందాడు. ఆట ముగిసే సమయానికి ఆంధ్ర వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది. హైదరాబాద్ 171 ఆలౌట్ రాజస్తాన్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. సుమంత్ (51; 7 ఫోర్లు) రాణించాడు. రాజస్తాన్ బౌలర్లు రితురాజ్, అనికేత్ చెరో 3 వికెట్లు తీశారు. సర్ఫరాజ్ డబుల్ సెంచరీ... ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కిన ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్... హిమాచల్‌ప్రదేశ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ (226 బ్యాటింగ్; 32 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో చెలరేగాడు. ఫలితంగా ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు నష్టపోయి 372 పరుగులు చేసింది. -
కౌంటీ మ్యాచ్‌లో ఇషాంత్‌కు 5 వికెట్లు
బర్మింగ్‌హామ్: కౌంటీల్లో మొదటిసారి ఆడుతున్న భారత పేసర్ ఇషాంత్ శర్మ తొలి మ్యాచ్‌లోనే ఆదరగొట్టాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఢిల్లీ సీమర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు తీశాడు. వార్విక్షైర్తో జరిగిన ఈ నాలుగు రోజుల మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వార్విక్షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల వద్ద ఆలౌటైంది. బెల్ (70), అంబ్రోస్ (81) రాణించారు. ససెక్స్ బౌలర్ ఇషాంత్ శర్మ 53 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, వైస్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసి ఆలౌటైంది. వైస్ (106) సెంచరీ సాధించాడు. తర్వాత వార్విక్షైర్ రెండో ఇన్నింగ్స్‌లో మ్యాచ్ ముగిసే సమయానికి 3 వికెట్లకు 87 పరుగులు చేసింది. ఇందులో రెండు వికెట్లను ఇషాంతే తీశాడు. -
ఐదు వికెట్లు కోల్పోయిన ముంబై
-
3.4 ఓవర్లు.. 4 పరుగులు.. 5 వికెట్లు...
దుబాయ్ : పదిహేడేళ్ల పాకిస్థాన్ కుర్రాడు షహీన్ అఫ్రిదీ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. బంతితో మైదానంలో షహీన్ దుమ్ము రేగొట్టాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా కేవలం నాలుగు పరుగులు ఇచ్చి.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీ-20 ఫార్మట్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. శుక్రవారం లాహోర్ క్వాలాండర్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ జట్టు ఒక దశలో 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక అక్కడ నుంచి షహీన్ బంతితో చెలరేగిపోయాడు. 3.4 ఓవర్లు వేసిన షహీన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 16వ ఓవర్లలో మూడు వికెట్లు దక్కించుకోవటం విశేషం. వెరసి సుల్తాన్ ముల్తాన్ జట్టును 114 పరుగులకే షహీన్ కట్టడి చేశాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ఫెర్మామెన్స్ గనుక గమనిస్తే... శ్రీలంక బౌలర్ హెరాత్ న్యూజిలాండ్‌పై, రషీద్ ఖాన్ ఐర్లాండ్‌పై, సోహైల్ తన్వీర్ ట్రిడెంట్స్ జట్టులపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఈ లిస్ట్‌లో కుంబ్లేను (5 పరుగులు 5 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ పై) కిందకి నెట్టి షహీన్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు.