ఐపీఎల్‌ చరి‍త్రలో చహల్‌ కొత్త రికార్డు.. | IPL 2022 Chahal Record Taking Hat-trick-5 Wicket Haul Single Match | Sakshi
Sakshi News home page

Yuzvendra Chahal: ఐపీఎల్‌ చరి‍త్రలో చహల్‌ కొత్త రికార్డు..

Published Mon, Apr 18 2022 11:38 PM | Last Updated on Tue, Apr 19 2022 8:26 AM

IPL 2022 Chahal Record Taking Hat-trick-5 Wicket Haul Single Match - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ సంచలనం సృష్టించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ తీయడంతో పాటు ఐదు వికెట్ల ఫీట్‌ సాధించాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఒకే ఓవర్లో హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు తీసి కేకేఆర్‌ను చావుదెబ్బ కొట్టాడు. ముందుగా వెంకటేశ్‌ అయ్యర్‌ను తొలి బంతికే స్టంప్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్‌ అయ్యర్‌, శివమ్‌ మావి, పాట్‌ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

ఐపీఎల్‌ చరిత్రలో చహల్‌ది 21వ హ్యాట్రిక్‌ కాగా.. రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున హ్యాట్రిక్‌ సాధించిన ఐదో బౌలర్‌గా చహల్‌ నిలిచాడు. ఇంతకముందు రాజస్తాన్‌ నుంచి అజిత్‌ చండీలా, ప్రవీణ్‌ తాంబే, షేన్‌ వాట్సన్‌, శ్రేయాస్‌ గోపాల్‌ ఈ ఘనత సాధించారు.  అంతేకాదు ఐపీఎల్‌ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన 25 బౌలర్‌గా చహల్‌ నిలచాడు. అయితే ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా చహల్‌ చరిత్ర సృష్టించాడు.ఓవరాల్‌గా కేకేఆర్‌తో మ్యాచ్‌లో చహల్‌ (4-0-40-5)తో ఐపీఎల్‌ కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement