
Todd Murphy Five Wicket Haul.. నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో చెలరేగాడు. శ్రీకర్ భరత్ వికెట్ తీయడం ద్వారా మర్ఫీ ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ముందు నుంచి అనుకున్నట్లుగానే ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ నాథన్ లియోన్ కంటే టాడ్ మర్ఫీ అధికంగా ప్రభావం చూపించాడు.
స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టాడ్ మర్ఫీ వికెట్ల పండగ చేసుకున్నాడు. కాగా మర్ఫీకి ఇదే డెబ్యూ టెస్టు కావడం విశేషం. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసి మర్ఫే ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లతో చెలరేగిన నాలుగో ఆఫ్‌స్పిన్నర్‌గా నిలిచాడు. ఇంతకముందు 1986-87లో పీటర్ టేలర్( ఇంగ్లండ్‌పై 6/78), 2008-09లో జాసన్ క్రేజా( భారత్‌పై 8/215), 2011లో గాలేలో నాథన్ లియోన్(శ్రీలంకపై 5/66) ఉన్నారు. తాజాగా మర్ఫీ వీరి సరసన చేరాడు.
చదవండి: Ravindra Jadeja: 'జడేజా చీటింగ్ చేశాడా'.. చూసి మాట్లాడండి!