India vs Australia, 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆసీస్‌ను 177 పరుగులకు కట్టడి చేసిన భారత్.. 400 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. దీంతో మూడో రోజు ఆటలో 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శనివారం నాటి ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి ఈ మేరకు స్కోరు చేసి ఆలౌట్ అయింది.
రోహిత్, జడ్డూ, అక్షర్ అదుర్స్
ఇక రెండో రోజు ఆటలో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ(120) అద్భుత సెంచరీతో చెలరేగగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విలువైన అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఇక మూడో ఆట ఆరంభమైన కాసేపటికే జడ్డూ(70)ను ఆసీస్ అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ పెవిలియన్‌కు పంపగా.. అక్షర్(84)తో కలిసి మహ్మద్ షమీ విలువైన యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. షమీ 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు.
మర్ఫీకి మరుపురాని టెస్టు
ఆస్ట్రేలియా బౌలర్లలో అరంగేట్ర బౌలర్ టాడ్ మర్ఫీకి అత్యధికంగా 7 వికెట్లు దక్కాయి. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను అవుట్ చేయడం ద్వారా తొలి వికెట్ తీసిన మర్ఫీ.. అశ్విన్, పుజారా, కోహ్లి, జడేజా, శ్రీకర్ భరత్.. ఆఖర్లో షమీని పెవిలియన్‌కు పంపాడు. తద్వారా తన కెరీర్‌లో ఈ టెస్టును మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ కమిన్స్‌కు రెండు, నాథన్ లియోన్‌కు ఒక వికెట్ దక్కాయి.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. 141 ఏళ్ల రికార్డు బద్దలు
IND vs AUS: రోహిత్ శర్మకి సారీ చెప్పిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
🔥 SHAMI SPECIAL! That was entertaining while it lasted.
— The Bharat Army (@thebharatarmy) February 11, 2023
👏 A splendid knock from @MdShami11!
📷 BCCI • #MohammedShami #INDvAUS #AUSvIND #BorderGavaskarTrophy #TeamIndia #BharatArmy pic.twitter.com/u0vuLfYIXu
Comments
Please login to add a commentAdd a comment