Todd Murphy
-
Ashes 2023: అదొక్కటే మార్పు.. చివరి టెస్టులో వార్నర్‌కు చోటు!
The Ashes, 2023- England vs Australia, 5th Test: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 తుది అంకానికి చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జూలై 27న ఆరంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా రెండు, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలవగా.. నాలుగో టెస్టు వర్షార్పణం అయింది. ఆ ఒక్కటి గెలిచి కచ్చితంగా గెలుస్తామని భావించిన ఆతిథ్య ఇంగ్లండ్‌కు వరణుడు చేదు అనుభవం మిగల్చడంతో మాంచెస్టర్ డ్రాగా ముగిసిపోయింది. దీంతో.. ట్రోఫీ కోల్పోయినప్పటికీ ఐదో టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని స్టోక్స్ బృందం ఆశిస్తోంది. అదే సమయంలో 2-1తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక ఆసీస్ చివరి మ్యాచ్‌లోనూ సత్తా చాటి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐదో టెస్టు తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి టీమ్‌లో స్థానంలో కల్పించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ను పటిష్టం చేసే క్రమంలో మర్ఫీని నాలుగో టెస్టు నుంచి తప్పించి తప్పుచేశారని అభిప్రాయపడ్డారు. అదొక్కటే మార్పు ‘‘ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఏం చేయబోతోందో చూడాలి. నా లెక్క ప్రకారమైతే మర్ఫీని కచ్చితంగా జట్టులోకి తీసుకురావాలి. ఓవల్ మైదానంలో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి అతడిని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. మర్ఫీ ఒక్కడు తప్ప జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవనుకుంటున్నా. మాంచెస్టర్‌లో పర్వాలేదనిపించాడు. తక్కువ స్కోర్లకే పరిమితమైనా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తను ఓపెనర్‌గా రావడం ఖాయమనిపిస్తోంది’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జూలై 27- 31 వరకు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. యాషెస్ ఐదో టెస్టుకు పాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, జోష్ హాజిల్‌వుడ్. పాంటింగ్ ఇంగ్లండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జోష్ టంగ్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
Ashes Series: నాలుగో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం
మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 19) ప్రారంభం కానున్న నాలుగో యాషెస్ టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా, ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్‌లను ఎంపిక చేసుకున్న ఆసీస్ మేనేజ్మెంట్.. స్పెషలిస్ట్ పేసర్లుగా మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్‌లను బరిలోకి దించుతుంది. మూడో టెస్ట్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా టాడ్ మర్ఫీ బరిలో నిలువగా.. నాలుగో టెస్ట్‌కు ప్రకటించిన తుది జట్టులో అతనికి చోటు లభించలేదు. మర్ఫీ స్థానంలో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న కెమరూన్ గ్రీన్ తుది జట్టులోకి రాగా.. మూడో టెస్ట్‌లో అంతగా ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని హాజిల్‌వుడ్ భర్తీ చేశాడు. మూడో టెస్ట్ ఆడిన జట్టులో ఆసీస్ ఈ రెండు మార్పులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై కెప్టెన్ కమిన్స్ సహా మేనేజ్మెంట్ కూడా నమ్మకముంచింది. మాంచెస్టర్ పిచ్‌పై స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించదని భావించిన ఆసీస్.. ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగుతూ పెద్ద సాహసమే చేస్తుంది. పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, లబూషేన్ సేవలను వినియోగించుకోవాలని ఆసీస్ యాజమాన్యం భావిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్.. ఆసీస్ కంటే ముందే తమ తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క మార్పు చేసింది. గాయం కారణంగా మూడో టెస్ట్‌లో బౌలింగ్ చేయలేకపోయిన ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ -
Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..!
5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన (కాలు బెణికింది) వారి తురుపు ముక్క, స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ సిరీస్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. లయోన్ లేని లోటు ఆసీస్‌కు ఎదరుదెబ్బగా పరిగణించబడుతుంది. లయోన్ స్థానంలో సీఏ ఎవరిని కొత్తగా ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్‌కు లయోన్ స్థానంలో టాడ్ మర్ఫీ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మర్ఫీ ప్రతిభను (4 టెస్ట్‌ల్లో 14 వికెట్లు) పరిగణలోకి తీసుకుని సీఏ అతనివైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన మర్ఫీ.. ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. ఆసీస్-ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి మొదలు కానుంది. కాగా, రెండో టెస్ట్, రెండో రోజు ఆటలో బెన్ డకెట్ క్యాచ్ అందుకోబోతూ నాథన్ లయోన్ కాలు బెణికింది. యాదృచ్చికంగా ఈ మ్యాచ్ లయోన్‌కు తన కెరీర్లో వరుసగా వందో టెస్ట్ మ్యాచ్. గాయపడిన అనంతరం లయోన్ బరిలోకి దిగనప్పటికీ..నాలుగో రోజు జట్టు కోసం పెద్ద సాహసమే చేశాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు అతి మూల్యమైన పరుగులు సమకూర్చాడు. ఈ మ్యాచ్‌లో లయోన్ లేకపోయినా ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. స్టోక్స్ పోరాటం వృధా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆసీస్ అంతిమంగా విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వారికి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాపించాడు. వీరోచితమైన ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించినంత పని చేశాడు. ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కడే అద్భుతమైన పోరాటం చేశాడు. జట్టులో డకెట్్ (83) మినహా మిగతా వారెవ్వరి నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్ 327 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు! అవునంటూ ఆసీస్ దిగ్గజానికి రవిశాస్త్రి కౌంటర్
Ind Vs Aus 3rd Test Indore Day 1: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బుధవారం (మార్చి 1) ఆరంభమైన మూడో టెస్టులో ఆది నుంచే బంతి స్పిన్‌కు టర్న్ అవుతోంది. ఇండోర్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన లంచ్ సమయానికి 84 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్లో బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ(12) వికెట్‌తో ఖాతా తెరిచాడు. చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు తర్వాతి రెండో ఓవర్లో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(21)ను అవుట్ చేశాడు. తర్వాత వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ రంగంలోకి దిగి ఛతేశ్వర్ పుజారా(1), రవీంద్ర జడేజా(4) వికెట్లు కూల్చగా.. కుహ్నెమన్ శ్రేయస్ అయ్యర్(0)ను డకౌట్ చేశాడు. వీరికి తోడు మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీ విరాట్ కోహ్లి(22)ని ఎల్బీడబ్ల్యూ చేసి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత లియోన్ శ్రీకర్ భరత్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగవు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఇండోర్ పిచ్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో కామెంట్రీలో భాగంగా.. ‘‘ప్రపంచంలో ఎక్కడా కూడా టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో స్పిన్నర్ ఆరో ఓవర్లో బౌలింగ్‌కు రానేరాడు. ప్రస్తుతం ఇంత జరుగుతున్న భారత శిబిరంలో మరీ అంత చిరాకు లేకపోవడానికి కారణం వాళ్లు తొలి రెండు టెస్టుల్లో గెలవడమే! కానీ ఇక్కడ బంతి ఎలా టర్న్ అవుతోందో చూడండి. అందుకే నాకు ఈ పిచ్‌లపై కంప్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడేమంటావు రవి? ముందుగా చెప్పినట్లు ప్రపంచంలో ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఆరో ఓవర్ స్పిన్నర్‌తో వేయించరు. అస్సలు ఆ అవకాశమే లేదు. ఇండోర్‌లో మూడో రోజు నుంచి బంతి టర్న్ అవుతుందని అంచనా వేశాం. బ్యాటర్లకు కూడా అవకాశం రావాలి కదా రవి. ఒక్క మాటతో అదుర్స్ అనిపించిన రవి! ఇప్పుడు మీ ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఏం చెబుతావో చెప్పు! మొదటి, రెండో రోజు బ్యాటింగ్‌కు కాస్త అనుకూలించాలి కదా!’’ అని బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హెడెన్ వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా రవిశాస్త్రి ఒక్క మాటతో.. ‘‘హోం కండిషన్స్’’ అంటూ హెడెన్‌కు అదిరిపోయే రీతిలో జవాబు ఇచ్చాడు. ‘‘స్వదేశంలో మ్యాచ్ అంటే మామూలుగా జరిగేదే ఇది! కానీ ఇక్కడ ఇంకాస్త కఠినంగా ఉంది పరిస్థితి. ఒక్కటంటే ఒక్క మెరుగైన భాగస్వామ్యం నమోదైతేనే కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది’’అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై జట్లకు కాస్త అనుకూలమైన పిచ్లే రూపొందిస్తారని, అందుకు ఎవరూ అతీతులు కారన్న అర్థంలో హెడెన్‌కు కౌంటర్ ఇచ్చాడు. చదవండి: Ind Vs Aus 3rd Test: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత.. అగ్రస్థానంలో.. Rohit Sharma: సున్నా దగ్గరే రెండుసార్లు.. ఉపయోగించుకోవడంలో విఫలం -
ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు?
ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక విషయంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం జట్టులో నాథన్ లియోన్ మాత్రమే ప్రధాన స్పిన్నర్‌గా కనిపిస్తున్నాడు. లియోన్ వయస్సు 35 సంవత్సరాలు. రిటైర్మెంట్కు దగ్గరికి వచ్చిన అతను మహా అయితే మరో రెండు సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది. దిగ్గజం షేన్ వార్న్ తర్వాత టాప్‌క్లాస్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న లియోన్ తన కెరీర్లో 117 టెస్టులాడి 468 వికెట్ల పడగొట్టాడు. దశాబ్దం కాలంగా లియోన్ ఆసీస్ టెస్టు జట్టులో ఏకైక ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. మరి అతను రిటైర్ అయ్యాకా ఆసీస్ క్రికెట్లో స్పిన్ భాద్యతలు తీసుకునేది ఎవరనేదానిపై చర్చ మొదలైంది. ఆసీస్ లాంటి ఫాస్ట్ పిచ్ మైదానాలపై పేస్ బౌలర్లకు కొదువ లేదు. ఆ దేశం నుంచి వచ్చే బౌలర్లలోనే ఎక్కువగా మీడియం, ఫాస్ట్ బౌలర్లే కనిపిస్తారు తప్ప స్పిన్నర్లు చాలా తక్కువ. స్వదేశంలో ఆడినంత వరకు పేస్ దళంతోనే మ్యాచ్‌లు గెలిచే ఆస్ట్రేలియా భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లకు వచ్చేసరికి స్పిన్నర్లను వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే టాడ్ మర్ఫీ రూపంలో ఆస్ట్రేలియా జట్టుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రెండు టెస్టులు కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఇదే విషయమై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు. ''ప్రస్తుతం ఆస్ట్రేలియాకు పెద్ద దిక్కులా మారాడు. వార్న్ లాంటి దిగ్గజ ఆటగాడిని భర్తి చేయలేకపోయిన ఉన్నంతలో అతను టాప్ క్లాస్ స్పిన్నర్. మరి లియోన్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ క్రికెట్లో స్పిన్ బాధ్యతలు తీసుకునేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అందుకు నా సమాధానం 22 ఏళ్ల టాడ్ మర్ఫీ. టీమిండియాతో తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా తరపున టాడ్ మర్ఫీ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్లతో ఆకట్టుకొని తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడు వికెట్లలోనూ ఐదు టాప్‌క్లాస్ బ్యాటర్లవే ఉన్నాయి. ఉపఖండం పిచ్‌లపై ప్రభావం చూపుతున్న ఒక డెబ్యూ బౌలర్ తర్వాతి కాలంలో జట్టుకు ప్రధాన స్పిన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. నాథన్ లియోన్ అలా వచ్చినవాడే. అతని వారసత్వాన్ని టాడ్ మర్ఫీ కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. అయితే ఆస్ట్రేలియాకు టాడ్ మర్ఫీ రూపంలో ఒక మంచి స్పిన్నర్ దొరికినట్లే. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న మర్ఫీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్బుతాలు చేయగలడన్న నమ్మకం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇరుజట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. రెండు టెస్టుల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. ఇక మూడో టెస్టు మార్చి ఒకటి నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు -
BGT 2023: ‘అతడికి ఘోర అవమానం.. అసలు ఎందుకు సెలక్ట్ చేశారు?’
India vs Australia, 2nd Test: భారత పర్యటనలో అష్టన్ అగర్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ అన్నాడు. అందుకే అతడు స్వదేశానికి తిరిగి వచ్చే యోచనలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అగర్‌ను టీమిండియాతో మ్యాచ్‌లలో ఎందుకు ఆడించడం లేదో అర్థం కావడం లేదని.. అలాంటపుడు ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. కాగా ఇప్పటి వరకు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ 9 వికెట్లు తీశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడో మ్యాచ్ సందర్భంగా టెస్టు ఆడాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ అష్టన్ అగర్. రెండుసార్లు మొండిచేయి ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్‌కు అనూలించే ఉపఖండ పిచ్‌లపై కీలక సిరీస్ నేపథ్యంలో నలుగురు స్పిన్నర్లకు స్థానం కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆష్టన్ అగర్(లెఫ్టార్మ్ స్పిన్నర్), నాథన్ లియాన్(రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్), మిచెల్ స్వెప్సన్(రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్)లతో పాటు 22 ఏళ్ల ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ తొలిసారిగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని తొలి టెస్టులో అరంగేట్రం చేసిన మర్ఫీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. రెండో మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. అష్టన్ అగర్ అరంగేట్రం చేసిన యువ ప్లేయర్లు ఇలా ఇక మిచెల్ స్వెప్సన్ తన బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి పయనం కాగా.. మాథ్యూ కుహ్నెమన్‌ను భారత్‌కు పంపించింది యాజమాన్యం. ఈ క్రమంలో స్వెప్సన్ స్థానంలో వచ్చిన కుహ్నెమన్ ఢిల్లీ టెస్టుతో అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలి టెస్టులో 2 వికెట్లతో రాణించాడు. ఇలా వీరిద్దరు ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్(మొత్తం 8 వికెట్లు )తో పాటు తమ వంతు పాత్ర పోషించారు. అయితే, అష్టన్ అగర్‌కు మాత్రం ఈ రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేయాలని భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఘోర అవమానం ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్.. అష్టన్ అగర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘జట్టుకు ఎంపికకావడం, విదేశీ పర్యటనల్లో జట్టుతో పాటే ఉండటం.. అయినా ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాకపోవడం.. నిజంగా పెద్ద అవమానమే! అందుకే అతడు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు’’ అని ఆస్ట్రేలియా రేడియో చానెల్లో గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. అగర్‌ను మేనేజ్మెంట్ దారుణంగా అవమానిస్తోందని చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో ఓడి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఛాన్స్‌ను మరింత సంక్లిష్టం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఇండోర్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్ BGT 2023: మూడో టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. సిరీస్ నుంచి వైదొలిగిన స్టార్ బౌలర్ -
Ind Vs Aus: 7 వికెట్లతో చెలరేగిన ఆసీస్ సంచలనం.. కళ్లజోడు ఎందుకంటే!
India vs Australia, 1st Test- Todd Murphy: ఆస్ట్రేలియా ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు అందుకుంటున్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో తొలి టెస్టులో మర్ఫీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అరంగేట్రంలోనే ఏడు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. రాహుల్ వికెట్ ప్రత్యేకం కేఎల్ రాహుల్‌ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తొలి వికెట్ తీశాడు. అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, మహ్మద్ షమీలను పెవిలియన్‌కు పంపాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా మొత్తంగా 124 పరుగులు ఇచ్చి ఈ మేరకు 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ 22 ఏళ్ల స్పిన్నర్. ప్రశంసల జల్లు తద్వారా ఆస్ట్రేలియా తరఫున డెబ్యూ టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. బాబ్ మాసీ, జేసన్ క్రెజా తర్వాతి స్థానాన్ని మర్ఫీ ఆక్రమించాడు. ఇక అరంగేట్రంలోనే టీమిండియా వంటి పటిష్ట జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచిన మర్ఫీపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సహా పలువురు క్రీడా విశ్లేషకులు మర్ఫీ ఆట తీరుకు ఫిదా అవుతున్నారు. 11 నెలల క్రితం ఒకే ఒక్క మ్యాచ్ కాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించిన టాడ్ మర్ఫీకి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. దాదాపు 11 నెలల క్రితం ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన మర్ఫీ.. ఈ మేరకు అరంగేట్రంలోనే పదునైన స్పిన్‌తో చెలరేగడం విశేషం. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన అతడు.. మరిన్ని అరుదైన ఘనతలు నమోదు చేసేందుకు సిద్ధమయ్యాడు. మర్ఫీ భావోద్వేగం ఈ నేపథ్యంలో తన ప్రదర్శన పట్ల టాడ్ మర్ఫీ హర్షం వ్యక్తం చేశాడు. గడిచిన రెండు రోజులు తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైనవంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇంతకంటే గొప్ప అరంగేట్రం ఏముంటుందంటూ భావోద్వేగానికి గురయ్యాడు. కళ్లజోడు ఎందుకంటే.. టాడ్ మర్ఫీ దూరంగా ఉన్న వస్తువులను చూడలేడు. అందుకే అతడు కళ్లజోడు ధరిస్తాడు. ఇక గతేడాది శ్రీలంక టూర్ సందర్భంగా ఆస్ట్రేలియా-ఏ జట్టుకు ఎంపికైన మర్ఫీ.. అద్బుత ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు(ఇప్పటి వరకు) ►8/84 బాబ్ మాసీ- 1972లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- లార్డ్స్ టెస్టులో ►8/215- జాసన్ క్రెజా- 2008/09- టీమిండియాతో మ్యాచ్‌లో- నాగ్‌పూర్ టెస్టులో ►7/124- టాడ్ మర్ఫీ- 2022/23* టీమిండియాతో మ్యాచ్‌లో - నాగ్‌పూర్ టెస్టులో. చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్‌కు చుక్కలు! వీడియో వైరల్ Rohit Sharma: రోహిత్ శర్మ రికార్డు.. రితికా పోస్ట్ వైరల్! లవ్ యూ.. -
సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్‌కు చుక్కలు! వీడియో వైరల్
ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 400 పరుగులకు ఆలౌటైంది. 321/7 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 79 పరుగులు ఆదనంగా చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా భారత జట్టుకు 223 పరుగుల ఆధిక్యం సాధించింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(120) సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులతో రాణించారు. అదే విధంగా ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. షమీ సూపర్ ఇన్నింగ్స్ ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు మహ్మద్ షమీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ.. కేవలం 47 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి. అయితే షమీ మూడు సిక్స్‌లు కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగిన టాడ్ మర్ఫీ బౌలింగ్‌లోనే బాదడం గమానార్హం. ఒక ఓవర్లోనే వరుసగా రెండు సిక్సర్లను షమీ కొట్టాడు. అదే విధంగా అక్షర్ పటేల్‌తో కలిసి షమీ విలువైన యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన షమీపై అభిమానులు ప్రశంసల వర్షం కురుస్తున్నారు. రాహల్, కోహ్లి కంటే బెటర్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. Great shot by @MdShami11 🥵💪#RohitSharma𓃵 #ViratKohli𓃵 #MohammedShami #Jadeja #INDvsAUSTest #BGT2023 pic.twitter.com/gg71Agzp05 — Rajat Singh (@SinghRajat00) February 11, 2023 🔥 SHAMI SPECIAL! That was entertaining while it lasted. 👏 A splendid knock from @MdShami11! 📷 BCCI • #MohammedShami #INDvAUS #AUSvIND #BorderGavaskarTrophy #TeamIndia #BharatArmy pic.twitter.com/u0vuLfYIXu — The Bharat Army (@thebharatarmy) February 11, 2023 చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. 141 ఏళ్ల రికార్డు బద్దలు -
Ind vs Aus: ఆకట్టుకున్న అక్షర్, షమీ.. 400 పరుగులకు టీమిండియా ఆలౌట్
India vs Australia, 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆసీస్‌ను 177 పరుగులకు కట్టడి చేసిన భారత్.. 400 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. దీంతో మూడో రోజు ఆటలో 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శనివారం నాటి ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి ఈ మేరకు స్కోరు చేసి ఆలౌట్ అయింది. రోహిత్, జడ్డూ, అక్షర్ అదుర్స్ ఇక రెండో రోజు ఆటలో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ(120) అద్భుత సెంచరీతో చెలరేగగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విలువైన అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఇక మూడో ఆట ఆరంభమైన కాసేపటికే జడ్డూ(70)ను ఆసీస్ అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ పెవిలియన్‌కు పంపగా.. అక్షర్(84)తో కలిసి మహ్మద్ షమీ విలువైన యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. షమీ 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. మర్ఫీకి మరుపురాని టెస్టు ఆస్ట్రేలియా బౌలర్లలో అరంగేట్ర బౌలర్ టాడ్ మర్ఫీకి అత్యధికంగా 7 వికెట్లు దక్కాయి. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను అవుట్ చేయడం ద్వారా తొలి వికెట్ తీసిన మర్ఫీ.. అశ్విన్, పుజారా, కోహ్లి, జడేజా, శ్రీకర్ భరత్.. ఆఖర్లో షమీని పెవిలియన్‌కు పంపాడు. తద్వారా తన కెరీర్లో ఈ టెస్టును మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ కమిన్స్‌కు రెండు, నాథన్ లియోన్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. 141 ఏళ్ల రికార్డు బద్దలు IND vs AUS: రోహిత్ శర్మకి సారీ చెప్పిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ 🔥 SHAMI SPECIAL! That was entertaining while it lasted. 👏 A splendid knock from @MdShami11! 📷 BCCI • #MohammedShami #INDvAUS #AUSvIND #BorderGavaskarTrophy #TeamIndia #BharatArmy pic.twitter.com/u0vuLfYIXu — The Bharat Army (@thebharatarmy) February 11, 2023 -
చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. 141 ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా స్పిన్ సంచలనం టాడ్ మర్ఫీ తన అరంగేట్ర టెస్టులోనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన మర్ఫీ.. తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట సందర్భంగా తన తొలి ఐదు వికెట్లు హాల్ సాధించిన మర్ఫీ.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక అరంగేట్ర టెస్టులోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన 22 ఏళ్ల మర్ఫీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా స్పిన్నర్‌గా మర్ఫీ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ జోయ్ ప్లామర్ పేరిట ఉండేది. ప్లామర్ 1882లో ఇంగ్లండ్‌తో జరగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 22 ఏళ్ల 360 రోజుల్లో ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఇక 22 ఏళ్ల 87 రోజుల వయస్సులోనే ఈ ఘనతను సాధించిన మర్ఫీ.. 141 ఏళ్ల ప్లామర్ రికార్డును బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో రికార్డును మర్ఫీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లతో చెలరేగిన నాలుగో ఆఫ్‌స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్కాట్ బొలాండ్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లియాన్ ఉన్నారు. చదవండి: IND vs AUS: రోహిత్ శర్మకి సారీ చెప్పిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ -
ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు
IND Vs AUS Day-2 Analaysis.. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. విశ్లేషణ విషయానికి వస్తే.. రెండోరోజు ఆటలో మొదట ఆస్ట్రేలియాదే ఆధిపత్యంలా కనిపించినప్పటికి చివరాఖరికి టీమిండియాదే పైచేయి. తొలి రెండు సెషన్లలో ఆస్ట్రేలియా ఆధిక్యం కనబరిచినప్పటికి రోహిత్ సెంచరీతో ఆసీస్ ఆధిపత్యం ఒక సెషన్‌కు పరిమితమైనట్లే. ఎందుకంటే చివరి సెషన్లో జడేజా, అక్షర్ పటేల్‌ల ఆటతో టీమిండియా నిలదొక్కుక్కుంది. నిలదొక్కుకోవడమే కాదు టీమిండియాకు భారీ ఆధిక్యం కట్టబెట్టేలా కనిపిస్తున్నారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో ఈ ఇద్దరు లంచ్ వరకు నిలబడితే చాలు.. మ్యాచ్ టీమిండియాదే అవుతుంది. ఒకవేళ ఆధిక్యం 200 పరుగులు దాటినా మ్యాచ్ టీమిండియావైపే మొగ్గి ఉంటుంది. మొదటి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ మూడో రోజుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. ఆకట్టుకున్న ఆసీస్ కుర్రాడు.. ఇక రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియా ఏదైనా లాభపడిందంటే టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో రాణించడం. 22 ఏళ్ల ఈ కుర్రాడికి ఇదే తొలి అంతర్జాతీయ టెస్టు. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీయడం అంటే మాములు విషయం కాదు. తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తో మొదటిరోజే కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టిన టాడ్ మర్ఫీ.. రెండోరోజు ఆటలో తన మ్యాజిక్ బౌలింగ్‌తో కోహ్లి, పుజారా, అశ్విన్, శ్రీకర్ భరత్‌లను బుట్టలో వేసుకొని పెవిలియన్ చేర్చాడు. అయితే తొలి టెస్టులో స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రభావం చూపిస్తాడని అనుకున్నారు.. కానీ ఎవరు ఊహించని విధంగా టాడ్ మర్ఫీ తన బౌలింగ్‌తో హైలైట్ అయ్యాడు. అతని బౌలింగ్‌లో స్టీవ్ ఓ కఫీ(2017లో టీమిండియాను తొలి టెస్టులో శాసించిన బౌలర్) బౌలింగ్ శైలి కొట్టొచ్చినట్లు కనిపించింది. 2017లో ఆస్ట్రేలియా టీమిండియా పర్యటనకు వచ్చినప్పుడు.. తొలి టెస్టులో స్టీవ్ ఓ కఫీ సంచలన ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 333 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో ఓ కఫీ ఆరు వికెట్లతో చెలరేగి టీమిండియా పతనాన్ని శాసించాడు. 2014లోనే అరంగేట్రం చేసినప్పటికి స్టీవ్ ఓ కఫీ బౌలింగ్ టీమిండియా బ్యాటర్లకు కొత్త. అందుకే అతని కొత్త బౌలింగ్ శైలిలో ఇబ్బందులు పడి వికెట్లు చేజార్చుకొని మ్యాచ్ ఓటమిపాలయ్యారు. అయితే ఇదే స్టీవ్ ఓ కఫీ బౌలింగ్‌ను తర్వాతి మ్యాచ్‌ల్లో చీల్చి చెండాడారు. ఆ దెబ్బకు ఓ కఫీ మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. తాజాగా టాడ్ మర్ఫీ కూడా అతని బౌలింగ్ శైలినే అనుకరిస్తుండడంతో అభిమానులు మరో స్టీవ్ ఓ కఫీ వచ్చాడని అభిప్రాయపడ్డారు. ఐదు వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే చివరి సెషన్లో జడేజా, అక్షర్ పటేల్‌లు అర్థశతకాలతో రాణించి టీమిండియాను నిలబెట్టారు. మర్ఫీ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికి జడ్డూ, అక్షర్ పటేల్‌లు తమ బ్యాటింగ్‌తో అతన్ని తొక్కేశారని అభిమానులు సరదాగా పేర్కొన్నారు. చదవండి: IND VS AUS 1st Test: బంతితో విఫలమైనా బ్యాటింగ్‌లో ఇరగదీసిన అక్షర్ పటేల్ -
లియోన్ అనుకుంటే డెబ్యూ బౌలర్ ఇరగదీశాడు
Todd Murphy Five Wicket Haul.. నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో చెలరేగాడు. శ్రీకర్ భరత్ వికెట్ తీయడం ద్వారా మర్ఫీ ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ముందు నుంచి అనుకున్నట్లుగానే ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ నాథన్ లియోన్ కంటే టాడ్ మర్ఫీ అధికంగా ప్రభావం చూపించాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టాడ్ మర్ఫీ వికెట్ల పండగ చేసుకున్నాడు. కాగా మర్ఫీకి ఇదే డెబ్యూ టెస్టు కావడం విశేషం. అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసి మర్ఫే ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లతో చెలరేగిన నాలుగో ఆఫ్‌స్పిన్నర్‌గా నిలిచాడు. ఇంతకముందు 1986-87లో పీటర్ టేలర్( ఇంగ్లండ్‌పై 6/78), 2008-09లో జాసన్ క్రేజా( భారత్‌పై 8/215), 2011లో గాలేలో నాథన్ లియోన్(శ్రీలంకపై 5/66) ఉన్నారు. తాజాగా మర్ఫీ వీరి సరసన చేరాడు. చదవండి: Ravindra Jadeja: 'జడేజా చీటింగ్ చేశాడా'.. చూసి మాట్లాడండి! రెండేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ