![Todd Murphy becomes youngest Australian spinner to bag fivefor in Tests - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/11/tod-murphy.jpg.webp?itok=0sMq3ooK)
ఆస్ట్రేలియా స్పిన్ సంచలనం టాడ్ మర్ఫీ తన అరంగేట్ర టెస్టులోనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన మర్ఫీ.. తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట సందర్భంగా తన తొలి ఐదు వికెట్లు హాల్ సాధించిన మర్ఫీ.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇక అరంగేట్ర టెస్టులోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన 22 ఏళ్ల మర్ఫీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా స్పిన్నర్‌గా మర్ఫీ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ జోయ్ ప్లామర్ పేరిట ఉండేది.
ప్లామర్ 1882లో ఇంగ్లండ్‌తో జరగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 22 ఏళ్ల 360 రోజుల్లో ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఇక 22 ఏళ్ల 87 రోజుల వయస్సులోనే ఈ ఘనతను సాధించిన మర్ఫీ.. 141 ఏళ్ల ప్లామర్ రికార్డును బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో రికార్డును మర్ఫీ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లతో చెలరేగిన నాలుగో ఆఫ్‌స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్కాట్ బొలాండ్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లియాన్ ఉన్నారు.
చదవండి: IND vs AUS: రోహిత్ శర్మకి సారీ చెప్పిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment