India vs Australia, 1st Test- Todd Murphy: ఆస్ట్రేలియా ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు అందుకుంటున్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో తొలి టెస్టులో మర్ఫీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అరంగేట్రంలోనే ఏడు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.
రాహుల్ వికెట్ ప్రత్యేకం
కేఎల్ రాహుల్‌ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ తీశాడు. అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, మహ్మద్ షమీలను పెవిలియన్‌కు పంపాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా మొత్తంగా 124 పరుగులు ఇచ్చి ఈ మేరకు 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ 22 ఏళ్ల స్పిన్నర్.
ప్రశంసల జల్లు
తద్వారా ఆస్ట్రేలియా తరఫున డెబ్యూ టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. బాబ్ మాసీ, జేసన్ క్రెజా తర్వాతి స్థానాన్ని మర్ఫీ ఆక్రమించాడు. ఇక అరంగేట్రంలోనే టీమిండియా వంటి పటిష్ట జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచిన మర్ఫీపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సహా పలువురు క్రీడా విశ్లేషకులు మర్ఫీ ఆట తీరుకు ఫిదా అవుతున్నారు.
11 నెలల క్రితం ఒకే ఒక్క మ్యాచ్
కాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించిన టాడ్ మర్ఫీకి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. దాదాపు 11 నెలల క్రితం ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన మర్ఫీ.. ఈ మేరకు అరంగేట్రంలోనే పదునైన స్పిన్‌తో చెలరేగడం విశేషం. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన అతడు.. మరిన్ని అరుదైన ఘనతలు నమోదు చేసేందుకు సిద్ధమయ్యాడు.
మర్ఫీ భావోద్వేగం
ఈ నేపథ్యంలో తన ప్రదర్శన పట్ల టాడ్ మర్ఫీ హర్షం వ్యక్తం చేశాడు. గడిచిన రెండు రోజులు తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైనవంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇంతకంటే గొప్ప అరంగేట్రం ఏముంటుందంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
కళ్లజోడు ఎందుకంటే..
టాడ్ మర్ఫీ దూరంగా ఉన్న వస్తువులను చూడలేడు. అందుకే అతడు కళ్లజోడు ధరిస్తాడు. ఇక గతేడాది శ్రీలంక టూర్ సందర్భంగా ఆస్ట్రేలియా-ఏ జట్టుకు ఎంపికైన మర్ఫీ.. అద్బుత ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు(ఇప్పటి వరకు)
►8/84 బాబ్ మాసీ- 1972లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- లార్డ్స్ టెస్టులో
►8/215- జాసన్ క్రెజా- 2008/09- టీమిండియాతో మ్యాచ్‌లో- నాగ్‌పూర్ టెస్టులో
►7/124- టాడ్ మర్ఫీ- 2022/23* టీమిండియాతో మ్యాచ్‌లో - నాగ్‌పూర్ టెస్టులో.
చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్‌కు చుక్కలు! వీడియో వైరల్
Rohit Sharma: రోహిత్ శర్మ రికార్డు.. రితికా పోస్ట్ వైరల్! లవ్ యూ..
Comments
Please login to add a commentAdd a comment