ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 400 పరుగులకు ఆలౌటైంది. 321/7 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 79 పరుగులు ఆదనంగా చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా భారత జట్టుకు 223 పరుగుల ఆధిక్యం సాధించింది.
టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(120) సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులతో రాణించారు. అదే విధంగా ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు.
షమీ సూపర్ ఇన్నింగ్స్
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు మహ్మద్ షమీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ.. కేవలం 47 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి. అయితే షమీ మూడు సిక్స్‌లు కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగిన టాడ్ మర్ఫీ బౌలింగ్‌లోనే బాదడం గమానార్హం.
ఒక ఓవర్‌లోనే వరుసగా రెండు సిక్సర్లను షమీ కొట్టాడు. అదే విధంగా అక్షర్ పటేల్‌తో కలిసి షమీ విలువైన యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన షమీపై అభిమానులు ప్రశంసల వర్షం కురుస్తున్నారు. రాహల్, కోహ్లి కంటే బెటర్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
Great shot by @MdShami11 🥵💪#RohitSharma𓃵 #ViratKohli𓃵 #MohammedShami #Jadeja #INDvsAUSTest #BGT2023 pic.twitter.com/gg71Agzp05
— Rajat Singh (@SinghRajat00) February 11, 2023
🔥 SHAMI SPECIAL! That was entertaining while it lasted.
— The Bharat Army (@thebharatarmy) February 11, 2023
👏 A splendid knock from @MdShami11!
📷 BCCI • #MohammedShami #INDvAUS #AUSvIND #BorderGavaskarTrophy #TeamIndia #BharatArmy pic.twitter.com/u0vuLfYIXu
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. 141 ఏళ్ల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment