The Ashes, 2023- England vs Australia, 5th Test: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 తుది అంకానికి చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జూలై 27న ఆరంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా రెండు, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలవగా.. నాలుగో టెస్టు వర్షార్పణం అయింది.
ఆ ఒక్కటి గెలిచి
కచ్చితంగా గెలుస్తామని భావించిన ఆతిథ్య ఇంగ్లండ్‌కు వరణుడు చేదు అనుభవం మిగల్చడంతో మాంచెస్టర్ డ్రాగా ముగిసిపోయింది. దీంతో.. ట్రోఫీ కోల్పోయినప్పటికీ ఐదో టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని స్టోక్స్ బృందం ఆశిస్తోంది. అదే సమయంలో 2-1తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక ఆసీస్ చివరి మ్యాచ్‌లోనూ సత్తా చాటి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐదో టెస్టు తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి టీమ్‌లో స్థానంలో కల్పించాలని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ను పటిష్టం చేసే క్రమంలో మర్ఫీని నాలుగో టెస్టు నుంచి తప్పించి తప్పుచేశారని అభిప్రాయపడ్డారు.
అదొక్కటే మార్పు
‘‘ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఏం చేయబోతోందో చూడాలి. నా లెక్క ప్రకారమైతే మర్ఫీని కచ్చితంగా జట్టులోకి తీసుకురావాలి. ఓవల్ మైదానంలో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి అతడిని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
మర్ఫీ ఒక్కడు తప్ప జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవనుకుంటున్నా. మాంచెస్టర్‌లో పర్వాలేదనిపించాడు. తక్కువ స్కోర్లకే పరిమితమైనా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తను ఓపెనర్‌గా రావడం ఖాయమనిపిస్తోంది’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జూలై 27- 31 వరకు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్ వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
యాషెస్ ఐదో టెస్టుకు పాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ తుది జట్టు:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, జోష్ హాజిల్‌వుడ్.
పాంటింగ్ ఇంగ్లండ్ తుదిజట్టు:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జోష్ టంగ్.
చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా..
Comments
Please login to add a commentAdd a comment