కౌంటీ మ్యాచ్‌లో ఇషాంత్‌కు 5 వికెట్లు  | Ishant Sharma marks county debut for Sussex with five wickets | Sakshi
Sakshi News home page

కౌంటీ మ్యాచ్‌లో ఇషాంత్‌కు 5 వికెట్లు 

Published Thu, Apr 19 2018 2:31 AM | Last Updated on Thu, Apr 19 2018 2:31 AM

Ishant Sharma marks county debut for Sussex with five wickets - Sakshi

బర్మింగ్‌హామ్‌: కౌంటీల్లో మొదటిసారి ఆడుతున్న భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ తొలి మ్యాచ్‌లోనే ఆదరగొట్టాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఢిల్లీ సీమర్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు తీశాడు. వార్విక్‌షైర్‌తో జరిగిన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వార్విక్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల వద్ద ఆలౌటైంది. బెల్‌ (70), అంబ్రోస్‌ (81) రాణించారు. ససెక్స్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ 53 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, వైస్‌కు 4 వికెట్లు దక్కాయి.

తర్వాత ససెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసి ఆలౌటైంది. వైస్‌ (106) సెంచరీ సాధించాడు. తర్వాత వార్విక్‌షైర్‌ రెండో ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ ముగిసే సమయానికి 3 వికెట్లకు 87 పరుగులు చేసింది. ఇందులో రెండు వికెట్లను ఇషాంతే తీశాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement