Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వికెట్లతో చెలరేగి లక్నో వెన్నులో వణుకు పుట్టించిన ఆకాశ్ మధ్వాల్ ఇవాళ్టి మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ లక్నోపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చరిత్రకెక్కాడు. ఐపీఎల్ చరిత్రలో 5 పరుగులకే ఐదు వికెట్లు తీసి అత్యంత బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన రెండో బౌలర్‌గా ఆకాశ్ మధ్వాల్ నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. 2009లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరపున కుంబ్లే ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు.
ఇక ముంబై ఇండియన్స్ తరపున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన ఆటగాడిగా ఆకాశ్ మద్వాల్ నిలిచాడు. ఇంతకముందు లసిత్ మలింగ 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 13 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం అత్యుత్తమంగా ఉంది.
ఇక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన జాబితాలో ఆకాశ్ మధ్వాల్ తొలి స్థానంలో నిలిచాడు. ఆకాశ్ తర్వాత అంకిత్ రాజ్‌పుత్- KXIP..(5/14 Vs SRH, 2018), వరుణ్ చక్రవర్తి-కేకేఆర్(5/20 Vs DC, 2020), ఉమ్రాన్ మాలిక్-ఎస్‌ఆర్‌హెచ్(5/25 Vs GT, 2022) ఉన్నారు.
Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX
— JioCinema (@JioCinema) May 24, 2023
Comments
Please login to add a commentAdd a comment