Ind Vs SA: Mohammed Shami Emotional Comments About His Father On 5 Wicket Haul - Sakshi
Sakshi News home page

Ind Vs Sa- Mohammed Shami: అంతా మా నాన్న వల్లే.. ఈ క్రెడిట్‌ ఆయనదే.. షమీ భావోద్వేగం

Published Wed, Dec 29 2021 10:24 AM | Last Updated on Wed, Dec 29 2021 11:24 AM

Ind Vs Sa 1st Test: Mohammed Shami Credits His Father On 5 Wicket Haul - Sakshi

Mohammed Shami Emotional Comments: ‘‘నేను ఓ పల్లెటూరి నుంచి వచ్చాను. అక్కడ ఇప్పటికీ సరైన సౌకర్యాలు లేవు. అలాంటి చోట నుంచి ఇక్కడి దాకా వచ్చానంటే ఈ క్రెడిట్‌ మా నాన్నదే. క్రికెట్‌ ప్రాక్టీసు కోసం మా గ్రామం నుంచి సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. మా నాన్న నా వెంట వచ్చేవారు. నా సోదరుడు నాకు అండగా నిలబడ్డారు. ఎన్నెన్నో కష్టాలు, పోరాటాల తర్వాతే ఇప్పుడున్న స్థితికి చేరుకున్నాను. నాకు దక్కుతున్న ప్రశంసలు అందుకునేందుకు మా నాన్నే అర్హులు.

నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నానంటే నా తండ్రి, సోదరుడి ప్రోత్సాహమే కారణం. నేను సాధించిన విజయాల ఘనత వారికే చెందుతుంది’’ అంటూ టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా 16 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు..  44 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

తద్వారా తన కెరీర్‌లో ఆరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ప్రొటిస్‌ జట్టును 197 పరుగులకే ఆలౌట్‌ చేసి భారత్‌కు ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక.. టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న 11వ బౌలర్‌గా షమీ నిలిచాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్వేగానికి లోనైన షమీ.. తన క్రికెట్‌ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ పైవిధంగా స్పందించాడు. తన ఎదుగుదలలో తండ్రి, సోదరుడు ముఖ్య భూమిక పోషించారని చెప్పుకొచ్చాడు. 

చదవండి: Aus Vs Eng: మరీ ఘోరంగా 92 పరుగులకే ఆలౌట్‌ అవుతారా! 68కి కూడా మైఖేల్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement