
యోచనలో గవర్నింగ్ కౌన్సిల్
న్యూఢిల్లీ: బంతిపై నునుపుదనం పెంచడం కోసం సలైవా (ఉమ్మి)ని వాడేందుకు అనుమతించాలంటూ ఇటీవల భారత పేసర్ మొహమ్మద్ షమీ విజ్ఞప్తి చేశాడు. సాధారణంగా ఉమ్మిని రుద్దడం వల్ల బంతి తన మెరుపును కోల్పోకుండా ఉండి రివర్స్ స్వింగ్‌కు సహకరిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇది ఆటలో భాగంగానే ఉన్నా... కోవిడ్ వచి్చనప్పుడు దీనిపై ఐసీసీ నిషేధం విధించింది.
ఇప్పుడు ఆ ప్రమాదం లేదు కాబట్టి నిబంధన తొలగించాలంటూ బౌలర్లు కోరుతున్నారు. ఈ విషయంలో బీసీసీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. బ్యాటర్ల ఆధిపత్యం సాగే లీగ్‌లో కొంతైనా బౌలర్లకు ‘రివర్స్ స్వింగ్’ ప్రయోజనం కలగవచ్చు. కాబట్టి కెప్టెన్లందరూ అంగీకరిస్తే ఐపీఎల్‌లో ‘సలైవా’ వాడేందుకు బోర్డు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు గతంలోలాగే హైట్, ఆఫ్ సైడ్ వైడ్‌లను నిర్ణయించే విషయంలో డీఆర్‌ఎస్ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment