టాప్ ర్యాంకుల్లో తాహిర్ | Imran Tahir claims top spot in ODI rankings for bowlers | Sakshi
Sakshi News home page

టాప్ ర్యాంకుల్లో తాహిర్

Published Sun, Feb 12 2017 9:34 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

టాప్ ర్యాంకుల్లో తాహిర్ - Sakshi

టాప్ ర్యాంకుల్లో తాహిర్

దుబాయ్: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. 761 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తాహిర్‌ 10 వికెట్లు పడగొట్టి ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌) నుంచి టాప్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్, వెస్టెండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు. టాప్ -10లో భారతీయ బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం.

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ డుప్లెసిస్ కెరీర్ లో బెస్ట్ ర్యాంకు సాధించాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్ లో 410 పరుగులు సాధించిన ప్లెసిస్ 7 స్థానాలు మెరుగుపరుచుకుని 4వ ర్యాంకులో నిలిచాడు. వార్నర్, డివిలియర్స్, కోహ్లి మొదటి మూడు ర్యాంకుల్లో ఉన్నారు. శ్రీలంకపై వన్డే సిరీస్‌ 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన దక్షిణాఫ్రికా టీమ్ మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంకు కైవసం చేసుకుంది. కాగా, టీ20 ర్యాంకింగ్స్ లోనూ ఇమ్రాన్ తాహిర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement