తాహిర్‌ తిప్పేశాడు  | South Africa win over Zimbabwe | Sakshi
Sakshi News home page

తాహిర్‌ తిప్పేశాడు 

Published Thu, Oct 11 2018 1:42 AM | Last Updated on Thu, Oct 11 2018 1:42 AM

South Africa win over Zimbabwe - Sakshi

ఈస్ట్‌ లండన్‌ (దక్షిణాఫ్రికా): లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (5/23) మాయాజాలంతో తొలి టి20లో దక్షిణాఫ్రికా 34 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచింది. ఈ పోరులో మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. డుసెన్‌ (56; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మిల్లర్‌ (39; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్‌ డుప్లెసిస్‌ (34; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.

తర్వాత జింబాబ్వే 17.2 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. తాహిర్‌ దెబ్బకు 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను పీటర్‌ మూర్‌ (44; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఆదుకున్నాడు.  మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. డాలా, ఫెలుక్వాయో చెరో 2 వికెట్లు తీశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement