
'ప్రయోగాలు చేయకపోతే.. మనుగడ కష్టం'
మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ టోర్నీలో స్సిన్నర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ స్పష్టం చేశాడు.
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ టోర్నీలో స్సిన్నర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ స్పష్టం చేశాడు. ఈ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తహీర్.. ప్రధానంగా ట్వంటీ 20 ఫార్మెట్ అనేది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో ఆకట్టుకున్న తాహీర్.. ఎప్పుడూ విన్నూత్న ప్రయోగాలు చేస్తుండాలన్నాడు. అలా చేయకపోతే ఎక్కువకాలం జట్టులో మనుగడ సాగించడం కష్టసాధ్యమన్నాడు.
భారత్ లో జరిగే ఈ టోర్నీలో ఇక్కడి ఆటగాళ్లు స్పిన్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటారని తాహీర్ తెలిపాడు. వన్డే ఫార్మెట్ కు, పొట్టి ఫార్మెట్ కు చాలా వ్యత్యాసం ఉంటుందన్నాడు. ట్వంటీ 20 ఫార్మెట్ కు తాను తొందరగా అలవాటు పడాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.