
బ్లూమ్‌ఫొంటీన్: ఇమ్రాన్ తాహిర్ (6/24) చెలరేగడంతో జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 120 పరుగుల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది.
ముందుగా దక్షిణాఫ్రికా 47.3 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. డేల్ స్టెయిన్ (60) టాప్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. అనంతరం జింబాబ్వే 24 ఓవ ర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. తాహిర్ తీసిన 6 వికెట్లలో ‘హ్యాట్రిక్’ కూడా ఉండటం విశేషం. ఓవరాల్‌గా జింబాబ్వేపై దక్షిణాఫ్రికాకిది వరుసగా 29వ విజయం.