భారత్ టూర్ కి ముగ్గురు స్పిన్నర్లు | Three spinners in South Africa squad against India | Sakshi
Sakshi News home page

భారత్ టూర్ కి ముగ్గురు స్పిన్నర్లు

Published Thu, Sep 10 2015 5:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

భారత్ టూర్ కి ముగ్గురు స్పిన్నర్లు

భారత్ టూర్ కి ముగ్గురు స్పిన్నర్లు

భారత్ లో పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. టెస్టులు, వన్డేలు, టీ20 లకు వేరు వేరుగా టీమ్ లను ఎంపిక చేసినట్లు సెలక్షన్ కన్వీనర్ లిండా తెలిపారు. భారత్ పర్యటనకు ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లను ఎంపిక చేసినట్లు వివరించారు. భారత్ లోని టర్నింగ్ పిచ్ లపై బౌలింగ్ సమ తూకంగా ఉండేందుకే.. ముగ్గురు స్పిన్నర్ల ఆప్సన్ ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. సైమన్ హామర్ కి తోడుగా.. శ్రీలంక పై సత్తాచాటిన ఇమ్రాన్ తాహిర్, డానేలను భారత పర్యటకు ప్రొటీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. టెస్ట్ టీమ్ కు షమీమ్ ఆమ్లా, వన్డే జట్టుకు ఏ బీ డివిలీర్స్, టీ20 జట్టుకు ఫఫ్ డు ప్లెసిస్ లు కెప్టెన్ లు గా వ్యవహరించనున్నారు.
రానున్న టీ20 వాల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని టీమ్ ఎంపిక జరిగినట్లు తెలిపారు. టీ20ల్లో  ఇమ్రాన్ తమ ట్రంప్ కార్డ్ అని లిండా చెప్పాడు. రెండు నెలల పైగా జరిగే ఈ టూర్ లో ప్రోటీస్ టీమ్  ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. తర్వాత మూడు టీ 20లు, 5 వన్డేలు, 4 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement