సౌతాఫ్రికాతో సిరీస్‌ల కోసం భారత జట్టు ప్రకటన
వచ్చే నెల (జూన్) 13 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే మల్టీ ఫార్మాట్ల సిరీస్‌ల కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (మే 30) ప్రకటించారు. భారత పర్యటనలో సౌతాఫ్రికా ఓ వన్డే వార్మప్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, ఏకైక టెస్ట్, మూడు టీ20లు ఆడనుంది.మూడు ఫార్మాట్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియా సారధిగా ఎంపిక కాగా.. అన్ని ఫార్మాట్లలో స్మృతి మంధన హర్మన్‌కు డిప్యూటీగా వ్యవహరించనుంది. జెమీమా రోడ్రిగెజ్, పూజా వస్త్రాకర్లను మూడు ఫార్మాట్లలో జట్టుకు ఎంపికైనప్పటికీ.. ఫిట్నెస్ పరీక్ష నెగ్గితేనే వారికి తుది జట్టులో అవకాశం ఉంటుంది.భారత పర్యటనలో సౌతాఫ్రికన్లు తొలుత బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్‌తో వన్డే వార్మప్ మ్యాచ్ ఆడతారు. ఈ మ్యాచ్ జూన్ 13న బెంగళూరు వేదికగా జరుగనుంది. అనంతరం సౌతాఫ్రికా-భారత్‌లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. జూన్ 16న తొలి వన్డే, 19న రెండవది, 23న మూడో వన్డే జరుగుతుంది. మూడు మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ అనంతరం భారత్-సౌతాఫ్రికాలు ఏకైక టెస్ట్‌లో తలపడతాయి. చెన్నై వేదికగా జూన్ 28 నుంచి జులై 1 ఈ మ్యాచ్ జరుగనుంది. దీని తర్వాత ఇరు జట్లు టీ20 సిరీస్‌లో తలపడతాయి. జులై 5, 7, 9 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. టీ0 సిరీస్ మొత్తానికి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), ఉమా చెత్రి (వికెట్‌కీపర్), దయాళన్ హేమలత, రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ప్రియా పునియాఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), ఉమా చెత్రి (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ *, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియాటీ20 సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, ఉమా చెత్రి (వికెట్‌కీపర్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), జెమిమా రోడ్రిగ్స్ *, సజన సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, ఆశా శోభన, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డిస్టాండ్బై: సైకా ఇషాక్