South Africa Tour Of India 2022: BCCI Announced SA T20s, ODIs Complete Schedule - Sakshi
Sakshi News home page

South Africa Tour Of India: సెప్టెంబ‌ర్‌లో భారత్‌కు రానున్న ద‌క్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఇదే..!

Published Wed, Aug 3 2022 10:02 PM | Last Updated on Thu, Aug 4 2022 9:10 AM

BCCI Announced South Africa India Tour Schedule - Sakshi

ఈ ఏడాది చివరి వరకు వరుస సిరీస్‌లతో బిజీబిజీగా ఉన్న టీమిండియా షెడ్యూల్‌లో మరో సిరీస్‌ వచ్చి చేరింది. టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు దొరికిన కొద్ది గ్యాప్‌లో బీసీసీఐ ఓ పరిమత ఓవర్ల సిరీస్‌ను సెట్‌ చేసింది. సెప్టెంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు భారత్‌లో పర్యటించనున్నట్లు బీసీసీఐ బుధవారం కన్ఫర్మ్‌ చేసింది. ఈ పర్యటనలో సఫారీలు 3 వ‌న్డేలు, 3 టీ20లు ఆడనున్నారు. సెప్టెంబ‌ర్ 28న టీ20 సిరీస్ మొద‌లు కానుండ‌గా... అక్టోబ‌ర్ 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 

భారత పర్యటనలో దక్షిణాఫ్రికా షెడ్యూల్‌..

సెప్టెంబర్‌ 28- తొలి టీ20 (తిరువనంతపురం)

అక్టోబర్‌ 2- రెండో టీ20 (గౌహతి)

అక్టోబర్‌ 4- మూడో టీ20 (ఇండోర్‌)

అక్టోబర్‌ 6- తొలి వన్డే (లక్నో)

అక్టోబర్‌ 9- రెండో వన్డే (రాంచీ)

అక్టోబర్‌ 11- మూడో వన్డే (ఢిల్లీ)


చదవం‍డి: IND VS PAK: మౌకా.. మౌకా యాడ్‌కు మంగళం పాడిన స్టార్‌ స్పోర్ట్స్‌.. కారణం అదేనా..!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement