పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముల్తాన్ సుల్తాన్ బోణీ కొట్టింది. కరాచీ వేదికగా కరాచీ కింగ్స్‌తో జరగిన తొలి మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్తాన్ విజయంలో ఇమ్రాన్ తాహిర్, మహ్మద్ రిజ్వాన్ కీలక పాత్ర పోషించారు. తాహిర్ మూడు వికెట్లు పడగొట్టగా, రిజ్వాన్ 52 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కరాచీ కింగ్స్ నిర్ధేశించిన 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ముల్తాన్ చేధించింది.
ముల్తాన్ బ్యాటర్లలో రిజ్వాన్(52), సోహైబ్ మసూద్(30) పరుగులతో రాణించారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరాచీ కింగ్స్‌కు ఘనమైన ఆరంభం లభించినప్పటికీ.. భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగల్గింది. కరాచీ కింగ్స్ బ్యాటర్లలో షర్జీల్ ఖాన్ (43), జో క్లార్క్(26) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ఇక మూల్తాన్ బౌలింగ్‌లో తాహిర్ మూడు వికెట్లు పడగొట్టగా, దహాని, కుషీదల్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: Team India Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు..!
Comments
Please login to add a commentAdd a comment