
రైజింగ్ పుణే జట్టులో తాహిర్
ముంబై: దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్, ఐసీసీ వన్డే, టి20 నంబర్‌వన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్‌కు ఎట్టకేలకు ఐపీఎల్‌లో మరో అవకాశం లభించింది. గాయపడిన మిషెల్ మార్ష్ స్థానంలో రైజింగ్ పుణే జట్టు తాహిర్‌ను తీసుకుంది. గత నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన తాహిర్‌పై ఎవరూ ఆసక్తి చూపించలేదు. గత ఏడాది తాహిర్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. మరోవైపు పుణే తమ జట్టు పేరునుంచి చివరి టను తొలగించి సూపర్ జెయింట్‌గా మార్చుకుంది.
డికాక్ దూరం! : ఐపీఎల్–10కు మరో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ దూరమయ్యే అవకాశముంది. చేతి వేలిగాయంతో బాధపడుతోన్న డికాక్ పూర్తిగా కోలుకునేందుకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని జట్టు వర్గాలు తెలిపాయి. దాంతో ఐపీఎల్‌లో కూడా పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే డుమిని వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ పదో సీజన్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ఈ ఇద్దరు ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన డికాక్ కూడా దూరమైతే డేర్‌వెవిల్స్‌కు ఇది ఎదురుదెబ్బే!