వైరల్‌ : అయ్యో తాహీర్‌.. ఎంత పనాయే! | South Africa Leg Spinner Imran Tahir Celebrates Fall of Wicket On a No ball | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 12:56 PM | Last Updated on Sat, Nov 3 2018 12:59 PM

South Africa Leg Spinner Imran Tahir Celebrates Fall of Wicket On a No ball - Sakshi

ఇమ్రాన్‌ తాహీర్‌

పెర్త్‌ : దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ నవ్వులపాలయ్యాడు. మాములుగానే వికెట్‌ పడిన ఆనందంలో కొంచెం ఎక్కువ చేసే తాహీర్‌ ఈ సారి అలానే ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు ప్రైమ్‌ మినిస్టర్‌ X1తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో కగిసో రబడా వేసిన ఆరో ఓవర్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఫిలిప్‌ భారీ షాట్‌ ఆడాడు. ఆ బంతిని డీప్‌ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న తాహీర్‌ అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గ్యాలరీలోని అభిమానులవైపు తిరిగి, తన టీషర్టుపై ఉన్న పేరును సూచిస్తూ.. ‘నేనంటే ఇది’ అన్నట్లు సైగ చేశాడు.

కానీ ఆ బంతి కాస్త నోబాల్‌ కావడంతో తాహీర్‌ ఆనందం కాస్త ఆవిరైంది. అంపైర్‌ వైపు ఏ మాత్రం చూడకుండా తను చేసిన ఈ హడావుడికి తన మొహం చిన్నబోయింది. ఇక ఇలా దొరికిన తాహిర్‌ను అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆటాడుకుంటున్నారు. ‘ముందు అంపైర్‌ను చూడు..  ఆ తర్వాత సెలబ్రెషన్స్‌ చేసుకుందువు కానీ’ అని కామెంట్‌ చేస్తున్నారు.  ఈ మ్యాచ్‌ ఆసాంతం కామెంటేటర్లు ఈ ఘటనను ప్రస్తావిస్తూ నవ్వుకోవడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement