
కౌలాలంపూర్: మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా లీగ్ దశను ముగించాయి. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 83 పరుగుల తేడాతో నేపాల్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
బ్రయ్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), లారోసా (31), హస్రత్ గిల్ (30) రాణించారు. అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 56 పరుగులకే పరిమితమైంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆ్రస్టేలియా 6 పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలిచింది. గ్రూప్ ‘సి’లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 41 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు 6 పాయింట్లతో గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ జట్టు 17 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై... ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో అమెరికా జట్టుపై... న్యూజిలాండ్ జట్టు 67 పరుగుల తేడాతో సమోవాపై... ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 13 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచాయి. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఆతిథ్య మలేసియాతో వెస్టిండీస్; శ్రీలంకతో భారత్ తలపడతాయి.
గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్, శ్రీలంక... గ్రూప్ ‘బి’ నుంచి ఇంగ్లండ్, అమెరికా, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’ నుంచి దక్షిణాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్... గ్రూప్ ‘డి’ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకున్నాయి. మలేసియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘ఎ’ నుంచి చివరిదైన సూపర్ సిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.
చదవండి: ఆరంభం అదిరింది