![Shan Masood And Abdullah Shafique bring Pakistan back to life on dead Multan pitch](/styles/webp/s3/article_images/2024/10/7/pak_0.jpg.webp?itok=RL0-_9mB)
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సౌద్ షకీల్(35), నసీం షా(0) ఉన్నారు.
అయితే పాక్ బ్యాటర్లలో కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 253 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మసూద్ 177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 151 పరుగులు చేయగా.. షఫీక్ 184 బంతుల్లో 102 పరుగులు చేశాడు.
అయితే ఈ మ్యాచ్‌లో కూడా పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 30 పరుగులు మాత్రమే చేసి ఆజం ఔటయ్యాడు.తొలి రోజు ఆట ముగుస్తుందన్న సమయంలో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా బాబర్ పెవిలియన్‌కు చేరాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్‌సన్ రెండు వికెట్లు పడగొట్టగా.. బషీర్,వోక్స్ తలా వికెట్ సాధించారు.
చదవండి: కోచ్‌గా పనికిరాడన్నారు కదా: మెకల్లమ్ కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment