
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ అరంగ్రేటం చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ తమ తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నారని పీసీబీ పేర్కొంది. జమాల్ గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పాక్‌కు తొలిసారి ప్రాతినిథ్యం వహించగా.. ఖుర్రమ్ షెహజాద్ ఏ ఫార్మాట్‌లో అయిన జాతీయ జట్టుకు ఆడటం ఇదే తొలిసారి.
మరోవైపు ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఏడాది తర్వాత తిరిగి పాక్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోగా.. పాక్ తమ ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్‌గా మొహమ్మద్ రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్ అహ్మద్‌వైపే మొగ్గు చూపింది. ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్లా షఫీక్‌లను కొనసాగించిన పాక్ మేనేజ్‌మెంట్.. వన్ డౌన్‌లో నయా కెప్టెన్ షాన్ మసూద్, ఆతర్వాతి స్థానంలో తాజా మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్ బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది.
🚨 Playing XI for first Test 🚨
— Pakistan Cricket (@TheRealPCB) December 13, 2023
Aamir Jamal and Khurram Shahzad are set to make their Test debut 👏#AUSvPAK pic.twitter.com/4GqRRKZC6J
ఐదో స్థానంలో సౌద్ షకీల్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. పేస్ అటాక్‌ను షాహీన్ అఫ్రిది లీడ్ చేయనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గాయపడటంతో సల్మాన్ అలీ అఘా ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్ రేపటి నుంచి పెర్త్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. వరల్డ్‌కప్ వైఫల్యాల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో షాన్ మసూద్ పాక్ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా మసూద్‌కు ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం.
ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్
ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.