Australia v Pakistan
-
ఆసీస్ చేతిలో చిత్తైన పాక్.. అగ్రస్థానానికి టీమిండియా
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి అగ్రస్థానానికి చేరింది. తాజాగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోరంగా ఓడటంతో ఇప్పటివరకు టాప్‌లో ఉండిన పాక్ రెండో స్థానానికి పడిపోయింది. పాక్‌పై భారీ విజయంతో ఆసీస్ 2023-25 సైకిల్లో బోణీ కొట్టింది. ఈ సైకిల్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ కేవలం ఒకే మ్యాచ్‌లో గెలిచి, 41.67 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. భారత్.. ఈ సైకిల్లో ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించి, 66.67 పాయింట్ల శాతంతో 16 పాయింట్లు కలిగి టాప్‌లో నిలిచింది. ఆసీస్ చేతిలో ఓటమితో రెండో స్థానానికి పడిపోయిన పాక్ 2 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 66.67 పాయింట్ల శాతం కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్, పాక్‌ల తర్వాత న్యూజిలాండ్ (50 పాయింట్ల శాతం), బంగ్లాదేశ్ (50), ఆస్ట్రేలియా (41.67), వెస్టిండీస్ (16.67), ఇంగ్లండ్ (15) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164, మిచెల్ మార్ష్ 90 పరుగులతో చెలరేగగా.. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లతో సత్తా చాటాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
AUS VS PAK 1st Test: 500 వికెట్ల క్లబ్లో చేరిన లియోన్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను మట్టికరిపించారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్ల అరుదైన క్లబ్లో చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్లో లియోన్ సహా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519) లియోన్ కంటే ముందు 500 వికెట్ల క్లబ్లో చేరిన వారిలో ఉన్నారు. FIVE HUNDRED! #AUSvPAK #PlayOfTheDay @nrmainsurance pic.twitter.com/DyDC5hUdTJ — cricket.com.au (@cricketcomau) December 17, 2023 సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ లెజెండరీ క్లబ్లో చేరాడు. 36 ఏళ్ల లియోన్ 123 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి ఆసీస్ తరఫున ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్‌కు ముందు వార్న్, మెక్‌గ్రాత్ ఆసీస్ తరఫున 500 వికెట్ల క్లబ్లో చేరారు. లియోన్ తన 500 వికెట్ డీఆర్ఎస్కు వెళ్లి సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2) సాధించిన లియోన్ ఆసీస్ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. Nathan Lyon is an All-time legend of Test cricket. 🫡 pic.twitter.com/qjP4wYv5lg — Johns. (@CricCrazyJohns) December 17, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 360 పరుగుల తేడాతో ఘన విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాథన్ లియోన్ 3, స్టార్క్, కమిన్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి (డిక్లేర్) 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఆమిర్ జమాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. పాక్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టిన మిచెల్ మార్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై గడిచిన 24 ఏళ్లలో టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. పాక్ జట్టు ప్రకటన.. ఇద్దరు కొత్త ఆటగాళ్ల ఎంట్రీ
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ అరంగ్రేటం చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ తమ తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నారని పీసీబీ పేర్కొంది. జమాల్ గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పాక్‌కు తొలిసారి ప్రాతినిథ్యం వహించగా.. ఖుర్రమ్ షెహజాద్ ఏ ఫార్మాట్లో అయిన జాతీయ జట్టుకు ఆడటం ఇదే తొలిసారి. మరోవైపు ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఏడాది తర్వాత తిరిగి పాక్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోగా.. పాక్ తమ ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్‌గా మొహమ్మద్ రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్ అహ్మద్వైపే మొగ్గు చూపింది. ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్లా షఫీక్‌లను కొనసాగించిన పాక్ మేనేజ్మెంట్.. వన్ డౌన్లో నయా కెప్టెన్ షాన్ మసూద్, ఆతర్వాతి స్థానంలో తాజా మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్ బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. 🚨 Playing XI for first Test 🚨 Aamir Jamal and Khurram Shahzad are set to make their Test debut 👏#AUSvPAK pic.twitter.com/4GqRRKZC6J — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2023 ఐదో స్థానంలో సౌద్ షకీల్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. పేస్ అటాక్‌ను షాహీన్ అఫ్రిది లీడ్ చేయనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గాయపడటంతో సల్మాన్ అలీ అఘా ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్ రేపటి నుంచి పెర్త్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. వరల్డ్‌కప్ వైఫల్యాల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో షాన్ మసూద్ పాక్ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా మసూద్‌కు ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం. ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్. -
రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు
Many Similarities In Two Semi Finals Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నవంబర్ 11న జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్‌కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు రోజు(నవంబర్ 10) న్యూజిలాండ్ సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి.. దిగి పటిష్ట ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది సమరానికి అర్హత సాధించింది. అయితే, 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సెమీ ఫైనల్స్‌లో కొన్ని ఆసక్తికర పోలికలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రెండు మ్యాచ్‌లు రెండు వేర్వేరు నగరాల్లో జరిగినా.. అందులో చాలా విషయాలు యాదృచ్ఛికంగా ఒకేలా ఉన్నాయి. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రెండో సెమీస్‌లో ఆసీస్ ఇదే మార్జిన్(5 వికెట్ల తేడా)తో పాక్‌పై విజయం సాధించింది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ ఓ ఓవర్ ముందుగా లక్ష్యాన్ని(167 పరుగులు) ఛేదించగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా కూడా పాక్‌పై ఇదే తరహా(19 ఓవర్లలో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది)లో విజయం సాధించింది. రెండు సెమీ ఫైనల్స్‌లో కివీస్, ఆసీస్ జట్లు చివరి 5 ఓవర్లలో 60 ప్లస్ పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండు మ్యాచ్‌ల్లో కివీస్, ఆసీస్ జట్లకు చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా.. మరో ఓవర్ మిగిలుండగానే ఇరు జట్లు టార్గెట్‌ను చేరుకున్నాయి. ఇదిలా ఉంటే, నవంబర్ 14న జరిగే తుది సమరంలో ఆసీస్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్, కివీస్ జట్లు టీ20 ప్రపంచకప్‌ను నెగ్గలేదు. చదవండి: T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ అభిమానులు -
T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ అభిమానులు
Hasan Ali Trolled For Dropping Matthew Wade Catch: టీ20 ప్రపంచకప్-2021 సూపర్-12లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి, అజేయ జట్టుగా సెమీస్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్‌కు నవంబర్ 10న ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో శృంగ భంగమైంది. పాక్ 5 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో కూడా ఆఖరి వరకు పాక్‌కు తిరుగులేదనిపించినా.. హసన్ అలీ చేసిన ఒకే ఒక్క పొరపాటు పాక్ కొంపముంచింది. షాహీన్ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర హసన్ ఆలీ జారవిడిచాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదిన వేడ్.. మరో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. #Pakistan lost due to bad efforts by #HasanAli(@RealHa55an) on the field. He not only led #BabarAzam down but whole of Pakistan. it smells #fixing because he married an #Indian Samiya Arzoo.#T20WorldCup #PAKVSAUS #shaheenafridi #ImranKhan pic.twitter.com/4aszB900ZR — Rizwan Ahmad (@Rizwan_2Ahmad) November 12, 2021 ఈ నేపథ్యంలో హసన్ అలీ.. గతంలో(పాక్ చేతిలో భారత్ ఓడిన సందర్భంగా) టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ షమీ, విరాట్ కోహ్లిల మాదరే దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ట్రోలింగ్ మరింత శృతి మించిపోయింది. పాక్ ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ అభిమానులు.. భారతీయురాలైన హసన్ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. Well done RAW Agent Samiya Arzoo👏👏 #HasanAli pic.twitter.com/d6fDAMrUo7 — AgentVinod (@AgentVinod03) November 11, 2021 మరోవైపు, హసన్ ఆలీ కీలక సమయంలో క్యాచ్ డ్రాప్ చేయడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని స్వయానా పాక్ కెప్టెనే అభిప్రాయపడడంతో జట్టు సభ్యులెవరూ అతనికి మద్దతుగా నిలిచే ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే, హసన్ అలీపై జరుగుతున్న ఈ ఆన్లైన్ దాడిని భారత నెటిజన్లు మాత్రం ఖండిస్తున్నారు. హసన్ ఆలీకి భరోసా ఇస్తూ ‘IND stand with Hasan Ali’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా, భారత్‌కు చెందిన సమీయా అర్జోని హసన్ అలీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమీయా అర్జోతో పాటు సెమీస్‌లో ఒక్క పరుగుకే ఔటైన షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాను సైతం పాక్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. Pakistani fans waiting for Hassan Ali back home #PAKvAUS pic.twitter.com/NgcavqXcVq — Farzan Tufail 🇵🇸 (@Farzantufail786) November 11, 2021 చదవండి: ఆసీస్‌తో కీలకపోరుకు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. ఫైనల్లో ఇక కష్టమే -
వార్నరా మజాకా.. డెడ్ బాల్‌ను సిక్స్‌గా మలిచాడు, ఏకంగా 9 పరుగులు రాబట్టాడు
Warner Hits Six To A Dead Ball Bowled By Mohammad Hafeez: రసవత్తరంగా సాగిన టీ20 ప్రపంచకప్-2021 రెండో సెమీ ఫైనల్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్‌కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు ), మార్కస్ స్టోయినిస్(31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో) వీరోచిత ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆసీస్.. నవంబర్ 14న జరిగే తుది సమరంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్, కివీస్ జట్లు టీ20 ప్రపంచకప్‌ను నెగ్గలేదు. pic.twitter.com/anZk8VjP3X — Shaun (@ShaunakCric) November 11, 2021 ఇదిలా ఉంటే, పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ బౌల్ చేసిన మహ్మద్ హఫీజ్.. తొలి బంతిని డెడ్ బాల్‌గా విసిరాడు. రెండు సార్లు బౌన్స్ అయిన ఈ బంతిని వార్నర్ భారీ సిక్సర్‌గా మలిచడంతో అందరూ అవాక్కయ్యారు. ఇది చూసి షాక్‌లో ఉండిపోయిన బాబర్ సేనకు అంపైర్ మరో షాకిచ్చాడు. ఈ బాల్‌ను నో బాల్‌గా ప్రకటించగా, ఆసీస్‌కు ఫ్రీ హిట్ లభించింది. అయితే, ఆ తర్వాత బంతిని హాఫీజ్ కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో వార్నర్ దెబ్బకు ఒకే బంతికి 9 పరుగులు వచ్చాయి. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. చదవండి: Aus Vs Pak: ఛాతిలో ఇన్ఫెక్షన్.. రెండు రోజులు ఐసీయూలో.. రిజ్వాన్‌పై ప్రశంసలు -
బాబర్ ఖాతాలో మరో రికార్డు.. కోహ్లిని వెనక్కు నెట్టి చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్
Babar Azam Becomes Quickest To Reach 2500 T20I Runs: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో సైమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 2500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో బాబర్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని సైతం అధిగమించాడు. బాబర్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లో 2500 పరుగుల మైలరాయిని చేరుకోగా.. కోహ్లి 68 ఇన్నింగ్స్‌ల్లో, ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ 78 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో బాబర్ 39 పరుగులు చేసి వెనుదిరిగగా.. మహ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫకర్ జమాన్(32 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకాలతో రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే డేవిడ్ వార్నర్(16 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), మిచెల్ మార్ష్(20 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్) ఆసీస్‌ను ఆదుకున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 52/1. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే 84 బంతుల్లో 125 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: T20 WC 2021: జట్టు ఏదైనా సరే.. పాక్‌ను ఓడించడం అసాధ్యం..! -
T20 WC 2021: జట్టు ఏదైనా సరే.. పాక్‌ను ఓడించడం అసాధ్యం..!
Impossible To Beat Pakistan Says PCB Cheif Ramiz Raja: టీ20 ప్రపంచకప్-2021లో వరుస విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ రమీజ్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. మెగా టోర్నీలో భాగంగా ఇవాళ(నవంబర్ 11) ఆసీస్‌తో కీలక సమరానికి ముందు జట్టు సభ్యులను ఉత్తేజపరుస్తూ ఓ వీడియా సందేశాన్ని రూపొందించి పీసీబీ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. పాక్ జట్టు ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. ప్రపంచంలో ఏ జట్టునైనా మట్టికరిపించగలదని ధీమా వ్యక్తం చేశాడు. Play with pride and passion! PCB chairman Ramiz Raja has a special message for Babar Azam's team. #WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/fS0rghZ4nG — Pakistan Cricket (@TheRealPCB) November 10, 2021 జట్టు సభ్యులందరూ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా కలిసి కట్టుగా ఆడుతున్నారని, నాయకుడు బాబర్ ఆజమ్ జట్టును అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నాడని కొనియాడాడు. తాను కూడా మూడు ప్రపంచకప్‌లు ఆడానని, ఓ ఆటగాడికి ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఆడే అనుభవం వేరుగా ఉంటుందని అన్నాడు. పాక్ జట్టు ఇప్పటివరకు అద్భుతంగా రాణించిందని, మూడు ప్రపంచకప్‌లు ఆడిన అనుభవంతో చెబుతున్నాను.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్ధి ఎవరైనా పాక్‌ను ఓడించడం అసాధ్యమంటూ బాబర్ సేనను ఆకాశానికెత్తాడు. కాగా, రమీజ్.. పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాక్ ప్రపంచకప్ జట్టులో కీలక మార్పులు చేసిన విజయంతమైన సంగతి తెలిసిందే. చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
ఆసీస్ బౌలర్ల ధాటికి పాక్ విలవిల
హైదరాబాద్: బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న మొదటి టెస్టులో ఆసీస్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాట్స్మన్లు విలవిలలాడిపోయారు. పాక్ తన తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సమీ అస్లామ్ 22, బాబర్ ఆజామ్ 19, సర్ఫరాజ్ అహ్మద్ 20 పరుగులు చేశారు. మిగతా వాళ్లంతా ఒక అంకె స్కోరుకే పరిమిత మయ్యారు. ఆసీస్ బౌలర్లలో హజల్‌వుడ్‌కు 3, బర్డ్‌కు 2, మిచెల్స్టార్క్కు 3 వికెట్లు దక్కాయి. పాకిస్థాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. సర్ఫరాజ్ (31 బ్యాటింగ్), ఆమిర్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు అస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 130 పరుగులు, హ్యండ్స్‌కోంబ్ 105 పరుగుల, రెన్షా 71 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఆమిర్ 4, రియాజ్ 4, యాసిర్ షా 2 వికెట్లు తీశారు.