వార్నరా మజాకా.. డెడ్‌ బాల్‌ను సిక్స్‌గా మలిచాడు, ఏకంగా 9 పరుగులు రాబట్టాడు | T20 World Cup 2021: Warner Hits Six To A Double Bounce Delivery Bowled By Mohammad Hafeez | Sakshi
Sakshi News home page

T20 WC 2021 PAK Vs AUS: వార్నరా మజాకా.. డెడ్‌ బాల్‌ను సిక్స్‌గా మలిచాడు, ఏకంగా 9 పరుగులు రాబట్టాడు

Published Fri, Nov 12 2021 1:17 PM | Last Updated on Fri, Nov 12 2021 3:56 PM

T20 World Cup 2021: Warner Hits Six To A Double Bounce Delivery Bowled By Mohammad Hafeez - Sakshi

Warner Hits Six To A Dead  Ball Bowled By Mohammad Hafeez: రసవత్తరంగా సాగిన టీ20 ప్రపంచకప్‌-2021 రెండో సెమీ ఫైనల్‌లో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్‌కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మాథ్యూ వేడ్‌(17 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు ), మార్కస్ స్టోయినిస్(31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆసీస్‌.. నవంబర్‌ 14న జరిగే తుది సమరంలో న్యూజిలాండ్‌‌తో తలపడనుంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్‌, కివీస్‌ జట్లు టీ20 ప్రపంచకప్‌ను నెగ్గలేదు.

ఇదిలా ఉంటే, పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ బౌల్‌ చేసిన మహ్మద్‌ హఫీజ్‌.. తొలి బంతిని డెడ్‌ బాల్‌గా విసిరాడు. రెండు సార్లు బౌన్స్‌ అయిన ఈ బంతిని వార్నర్‌ భారీ సిక్సర్‌గా మలిచడంతో అందరూ అవాక్కయ్యారు. ఇది చూసి షాక్‌లో ఉండిపోయిన బాబర్‌ సేనకు అంపైర్‌ మరో షాకిచ్చాడు. ఈ బాల్‌ను నో బాల్‌గా ప్రకటించగా, ఆసీస్‌కు ఫ్రీ హిట్ లభించింది. అయితే, ఆ తర్వాత బంతిని హాఫీజ్ కట్టుదిట్టంగా బౌల్‌ చేయడంతో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో వార్నర్‌ దెబ్బకు ఒకే బంతికి 9 పరుగులు వచ్చాయి. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
చదవండి: Aus Vs Pak: ఛాతిలో ఇన్ఫెక్షన్‌.. రెండు రోజులు ఐసీయూలో.. రిజ్వాన్‌పై ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement