Mohammad Hafeez
-
జూనియర్ క్రికెట్ లీగ్‌పై సంచలన కామెంట్స్ చేసిన పాక్ వెటరన్
యువ క్రికెటర్లను గుర్తించి, వారిలోని టాలెంట్‌ను వెలికి తీసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తరహాలో పాకిస్తాన్ జూనియర్ క్రికెట్ లీగ్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ టోర్నీని ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 15 వరకూ లాహోర్ వేదికగా నిర్వహించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ క్రికెట్ లీగ్‌పై ఆ దేశ వెటరన్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ సంచలన కామెంట్స్ చేశాడు. 19 ఏళ్లు కూడా నిండని కుర్రాళ్లతో క్రికెట్ ఆడించడం చైల్డ్ లేబర్‌తో సమానమని వ్యాఖ్యానించాడు. జూనియర్ క్రికెట్ లీగ్ అనే ఐడియా పాక్‌లో క్రికెట్ వ్యవస్థని నాశనం చేస్తుందని అన్నాడు. యువ క్రికెటర్లకు ఇలాంటి వేదిక పాక్షికంగా లాభం చేకూర్చినప్పటికీ.. భవిష్యత్తులో మానసికంగా, శారీరకంగా సమస్యలు ఎదుర్కొనేలా చేస్తుందని తెలిపాడు. యుక్త వయసులో షార్ట్ క్రికెట్ ఆడటం వల్ల కుర్రాళ్లు బేసిక్స్ దగ్గరే ఆగిపోతారని, సుదీర్ఘ ఫార్మాట్ ఆడటం వారి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా, భారత్‌లో జరిగే ఐపీఎల్లో ఆడాలంటే కుర్రాళ్ల వయసు కనీసం 19 ఏళ్లు నిండి ఉండాలన్న నిబంధన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఒక వేళ ఆటగాడి వయసు 19 దాటకపోతే, అతనికి లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన అనుభవమైనా ఉండాలి. ఈ నిబంధన కారణంగా భారత అండర్ 19 వరల్డ్ కప్ 2022 హీరోలు రఘువంశీ, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడే అవకాశాన్ని కోల్పోయారు. చదవండి: టీమిండియా విండీస్ పర్యటన షెడ్యూల్ ఖరారు..! -
పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. మహ్మద్ హఫీజ్ సంచలన నిర్ణయం..
పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు విడ్కోలు పలికాడు. 2018లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హఫీజ్.. తాజాగా వన్డేలు, టీ20లనుంచి తప్పుకున్నాడు. దాదాపు 18 ఏళ్లపాటు పాక్ క్రికెట్‌కు సేవలు అందించాడు. 2003లో జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్లో అతడు అరంగట్రేం చేశాడు. కాగా అతడు చివరి మ్యాచ్ టీ20 ప్రపంచకప్-2021 సెమీఫైనల్లో ఆస్టేలియాపై ఆడాడు. పాక్ తరుపున 55 టెస్ట్‌లు, 218 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తన అంతర్జాతీయ కేరిర్‌లో 21 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో పాటు, 12000 పైగా పరుగులు చేశాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్‌ల్లో హాఫీజ్ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే కరీబియాన్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, దుబాయ్ టీ10 లీగ్‌లో భాగమై ఉన్నాడు. చదవండి: BCCI: ఆ క్రికెటర్లు ఒక్కొక్కరికి 11 లక్షల చొప్పున.. మరో 5 లక్షలు కూడా -
వార్నరా మజాకా.. డెడ్ బాల్‌ను సిక్స్‌గా మలిచాడు, ఏకంగా 9 పరుగులు రాబట్టాడు
Warner Hits Six To A Dead Ball Bowled By Mohammad Hafeez: రసవత్తరంగా సాగిన టీ20 ప్రపంచకప్-2021 రెండో సెమీ ఫైనల్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్‌కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు ), మార్కస్ స్టోయినిస్(31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో) వీరోచిత ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆసీస్.. నవంబర్ 14న జరిగే తుది సమరంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్, కివీస్ జట్లు టీ20 ప్రపంచకప్‌ను నెగ్గలేదు. pic.twitter.com/anZk8VjP3X — Shaun (@ShaunakCric) November 11, 2021 ఇదిలా ఉంటే, పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ బౌల్ చేసిన మహ్మద్ హఫీజ్.. తొలి బంతిని డెడ్ బాల్‌గా విసిరాడు. రెండు సార్లు బౌన్స్ అయిన ఈ బంతిని వార్నర్ భారీ సిక్సర్‌గా మలిచడంతో అందరూ అవాక్కయ్యారు. ఇది చూసి షాక్‌లో ఉండిపోయిన బాబర్ సేనకు అంపైర్ మరో షాకిచ్చాడు. ఈ బాల్‌ను నో బాల్‌గా ప్రకటించగా, ఆసీస్‌కు ఫ్రీ హిట్ లభించింది. అయితే, ఆ తర్వాత బంతిని హాఫీజ్ కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో వార్నర్ దెబ్బకు ఒకే బంతికి 9 పరుగులు వచ్చాయి. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. చదవండి: Aus Vs Pak: ఛాతిలో ఇన్ఫెక్షన్.. రెండు రోజులు ఐసీయూలో.. రిజ్వాన్‌పై ప్రశంసలు -
పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్‌కు అస్వస్థత..
Mohammad Hafeez: పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్‌కు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ టీ20 కప్ టోర్నీలో సెంట్రల్ పంజాబ్ జట్టుకు హఫీజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆజట్టు స్ధానికంగా ఓ హోటల్లో బస చేస్తుంది. ఈ క్రమంలో హోటల్లో అందించిన ఆహారాన్ని తినడం ద్వారా హఫీజ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. నాణ్యత లేని ఆహారం అందించిన రెస్టారెంట్‌పై హఫీజ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. కాగా వచ్చే నెల జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ప్రకటించిన జట్టులో మహ్మద్ హఫీజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఆదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ ఆక్టోబర్ 24న భారత్‌తో తలపడనుంది. చదవండి: SRH vs PBKS: జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ -
'గేల్.. నీలాగా నాకు కండలు లేవు'
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)2021లో సోమవారం క్వెట్టా గ్లాడియేటర్స్, లాహోర్ క్యూలాండర్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్యూలాండర్స్ గ్లాడియేటర్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (40 బంతుల్లో 68 పరుగుల)తో టాప్ స్కోర్‌రగా నిలవగా.. కెప్టెన్ సర్ఫరాజ్ 40 పరుగులతో రాణించాడు. అనంతరం క్యూలాండర్స్ బ్యాట్స్‌మన్ మహ్మద్ హఫీజ్( 33 బంతుల్లో 73 పరుగులు; 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విజృంభించడంతో లాహోర్ క్యూలాండర్స్ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ 52 బంతుల్లో 82 పరుగులతో రాణించాడు. కాగా మ్యాచ్ అనంతరం మహ్మద్ హఫీజ్, క్రిస్ గేల్ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది. హఫీజ్ మెరుపు బ్యాటింగ్‌ను మెచ్చుకుంటూ.. 'నీకు ఇంత బలం ఉందా.. లేక నీ బ్యాట్కేమైనా పవర్స్ ఉన్నాయా? బంతిని అంత బలంగా బాదావు.. నీ ఇన్నింగ్స్ సూపర్ 'అంటూ గేల్ ప్రశంసించాడు. దీనికి హఫీజ్ స్పందిస్తూ.. 'థ్యాంక్యూ గేల్.. కానీ నీలాగా నాకు కండలు లేవు. ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే నీకంటే వేగంగా ఆడాలనే లక్ష్యాన్ని మాత్రమే పెట్టుకొని బరిలోకి దిగాను. ఆ తర్వాత నా చేతి నుంచి సిక్సర్లు, ఫోర్లు జాలువారాయి. కానీ ఒకటి మాత్రం నిజం.. నీలాగా మాత్రం ఎప్పటికి బ్యాటింగ్ చేయలేను' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: నాలుగు రోజులు లేటైంది..లేకపోతే కోట్లు పలికేవి! -
'స్నేహం పక్కన పెట్టి ఆడితే బాగుంటుంది'
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా పాక్ జట్టు వన్డే కెప్టెన్ బాబర్ అజామ్ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ను తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. 40 ఏళ్ల వయసుకు దగ్గర్లో ఉన్న మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లను టీ20 క్రికెట్లో ఇంకా ఎందుకు ఆడిస్తున్నారంటూ చురకలంటించాడు. అసలు పాక్ సెలెక్షన్ టీమ్‌కు సరైన ప్రణాళిక లేదని.. అందుకే వయసుమీద పడ్డవారిని ఆడిస్తున్నారని ఎద్దేవా చేశాడు. టీ20 అంటేనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహించాలి. కానీ కెప్టెన్‌గా బాబర్‌తో పాటు టీమ్ మేనేజ్మెంట్ అలా ఆలోచించడం లేదని... స్నేహం పేరుతో యువకులకు అవకాశం ఇవ్వడం లేదంటూ విమర్శించాడు. (చదవండి : పృథ్వీ షా.. నీ ప్రతిభ అమోఘం) 'కెప్టెన్‌గా బాబర్ అజామ్ తప్పు చేస్తున్నాడు. టీ20 అనేది యువ ఆటగాళ్లను దృష్ఠిలో పెట్టుకొని రూపొందించింది. కానీ బాబార్ జట్టు మేనేజ్మెంట్తో కలిసి 40 ఏళ్లకు దగ్గరలో ఉన్న హఫీజ్, మాలిక్‌లను ట20 జట్టుకు ఎంపిక చేయించాడు. ఇది కరెక్ట్ కాదు.. హఫీజ్, మాలిక్‌లు ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లే.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. టీ20 జట్టులో ఈ ఇద్దరు పనికిరారు. రాబోయే రెండేళ్లలో రెంటు టీ20 ప్రపంచకప్‌లు ఆడనున్న పాక్ జట్టులో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుంటుంది. బాబర్ అజామ్ స్నేహం అనే పదాన్ని పక్కనపెడితే బాగుంటుంది. అయినా కెప్టెన్‌తో పాటు జట్టును ఎంపిక చేసే సెలక్షన్ టీమ్ ధోరణి సరిగా లేదు.జట్టులో ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండాలి. (చదవండి : ‘ఆ బౌలర్‌తో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలే’) మా సమయంలో ఇలా ఉండేది కాదు.. ఇమ్రాన్ కొత్తగా కెప్టెన్ అయిన సమయంలో మార్పు పేరుతో ఐదు నుంచి ఆరు మంది సీనియర్ ఆటగాళ్లను వన్డే జట్టులో నుంచి తప్పించాం. కేవలం స్థిరంగా ఆడుతున్న జావేద్ మియాందాద్ లాంటి ఆటగాడిని మాత్రమే కొనసాగించాం. యువ ఆటగాళ్లతో నిండిన పాక్ జట్టు 1992లో ప్రపంచకప్ సాధించేవరకు వెళ్లగలిగింది. ఇప్పుడు మాత్రం జట్టు మేనేజ్మెంట్ అలా కనిపించడం లేదు. ఎప్పుడైనా ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఆటగాళ్ల ఎంపిక జరగాలి.. భవిష్యత్తుకు కూడా అదే మంచిది.' అంటూ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. -
పాకిస్థాన్ బౌలర్‌పై వేటు
కరాచీ: నిబంధనలను ఉల్లంఘించి బౌలింగ్ చేసినందుకు మరో పాకిస్థాన్ బౌలర్‌పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పాక్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్‌పై ఏడాది కాలం పాటు నిషేధం విధించింది. శ్రీలంకతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా హఫీజ్ బౌలింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ విచారణకు ఆదేశించింది. హఫీజ్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు పరిశీలనలో తేలడంతో ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది.