పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు విడ్కోలు పలికాడు. 2018లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హఫీజ్.. తాజాగా వన్డేలు, టీ20లనుంచి తప్పుకున్నాడు. దాదాపు 18 ఏళ్లపాటు పాక్ క్రికెట్‌కు సేవలు అందించాడు. 2003లో జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు అరంగట్రేం చేశాడు. కాగా అతడు చివరి మ్యాచ్ టీ20 ప్రపంచకప్-2021 సెమీఫైనల్లో ఆస్టేలియాపై ఆడాడు.
పాక్ తరుపున 55 టెస్ట్‌లు, 218 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తన అంతర్జాతీయ కేరిర్‌లో 21 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో పాటు, 12000 పైగా పరుగులు చేశాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్‌ల్లో హాఫీజ్ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే కరీబియాన్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, దుబాయ్ టీ10 లీగ్‌లో భాగమై ఉన్నాడు.
చదవండి: BCCI: ఆ క్రికెటర్లు ఒక్కొక్కరికి 11 లక్షల చొప్పున.. మరో 5 లక్షలు కూడా
Comments
Please login to add a commentAdd a comment