త్వరలో వన్డేలకు గుడ్ బై చెప్పనున్నఆఫ్రిది! | Shahid Afridi to retire from ODIs after 2015 World Cup | Sakshi
Sakshi News home page

త్వరలో వన్డేలకు గుడ్ బై చెప్పనున్నఆఫ్రిది!

Published Sun, Dec 21 2014 7:06 PM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

త్వరలో వన్డేలకు గుడ్ బై చెప్పనున్నఆఫ్రిది!

త్వరలో వన్డేలకు గుడ్ బై చెప్పనున్నఆఫ్రిది!

 లాహార్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది(34) త్వరలో వన్డేల నుంచి వీడ్కోలు తీసుకోనున్నాడు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో  జరిగే 2015 వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తరువాత వన్డేలకు గుడ్ బై చెప్పనున్నట్లు ఆఫ్రిది తాజాగా ప్రకటించాడు.  'నా జర్నీలో చాలా ఎత్తు పల్లాలను చూశాను. ఇప్పటి వరకూ ఆడిన క్రికెట్ తో చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నేనుగానే వన్డే క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను' అని ట్విట్టర్ ద్వారా ఆఫ్రిది తెలిపాడు. ఈ నిర్ణయం తీసుకోవడం బాధ కల్గించినా రిటైర్ అయ్యే సమయం ఆసన్నమయ్యిందని స్పష్టం చేశాడు.

 

తన 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ జీవితంలో పాకిస్థాన్ కు సేవలందించినందుకు గర్వంగా ఉందన్నాడు. 2010 లో టెస్ట్ క్రికెట్ నుంచి బయటకు వచ్చిన ఆఫ్రిది..2011 లో జరిగిన వరల్డ్ కప్ కు పాక్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సెమీ ఫైనల్స్ చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement