retire from ODIs
-
పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. మహ్మద్ హఫీజ్ సంచలన నిర్ణయం..
పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు విడ్కోలు పలికాడు. 2018లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హఫీజ్.. తాజాగా వన్డేలు, టీ20లనుంచి తప్పుకున్నాడు. దాదాపు 18 ఏళ్లపాటు పాక్ క్రికెట్‌కు సేవలు అందించాడు. 2003లో జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్లో అతడు అరంగట్రేం చేశాడు. కాగా అతడు చివరి మ్యాచ్ టీ20 ప్రపంచకప్-2021 సెమీఫైనల్లో ఆస్టేలియాపై ఆడాడు. పాక్ తరుపున 55 టెస్ట్‌లు, 218 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తన అంతర్జాతీయ కేరిర్‌లో 21 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో పాటు, 12000 పైగా పరుగులు చేశాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్‌ల్లో హాఫీజ్ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే కరీబియాన్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, దుబాయ్ టీ10 లీగ్‌లో భాగమై ఉన్నాడు. చదవండి: BCCI: ఆ క్రికెటర్లు ఒక్కొక్కరికి 11 లక్షల చొప్పున.. మరో 5 లక్షలు కూడా -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్
ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బిన్నీ సోమవారం ప్రకటించాడు. టీమిండియా తరుపున అతడు 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 95 మ్యాచ్‌లు ఆడిన బిన్నీ 4796 పరుగులు చేసి, బౌలింగ్‌లో 146 వికెట్లు పడగొట్టాడు. కాగా 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అద్భుతమైన ఘనత సాధించాడు. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి ఘోర ఓటమి తప్పదని భావిస్తున్న తరుణంలో బాల్‌తో అద్భుతం సృష్టించిన స్టువర్ట్ బిన్నీ, 4 పరుగులకే 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు బిన్నీ (6/4)వే కావడం విశేషం. ఇక 2014 ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆడిన స్టువర్ట్ బిన్నీ 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 2016లో వెస్టిండీస్‌పై చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. కాగా స్టువర్ట్ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మయంతి లాంగర్.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ, వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్ ఆటగాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ అనంతరం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ చేయలేక ఆండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేసింది. ఆమె ఈ పోస్ట్ చేసిన తరువాత రోజే స్టువర్ట్ బిన్నీ రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. చదవండి: Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. -
త్వరలో వన్డేలకు గుడ్ బై చెప్పనున్నఆఫ్రిది!
లాహార్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది(34) త్వరలో వన్డేల నుంచి వీడ్కోలు తీసుకోనున్నాడు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరిగే 2015 వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తరువాత వన్డేలకు గుడ్ బై చెప్పనున్నట్లు ఆఫ్రిది తాజాగా ప్రకటించాడు. 'నా జర్నీలో చాలా ఎత్తు పల్లాలను చూశాను. ఇప్పటి వరకూ ఆడిన క్రికెట్ తో చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నేనుగానే వన్డే క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను' అని ట్విట్టర్ ద్వారా ఆఫ్రిది తెలిపాడు. ఈ నిర్ణయం తీసుకోవడం బాధ కల్గించినా రిటైర్ అయ్యే సమయం ఆసన్నమయ్యిందని స్పష్టం చేశాడు. తన 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ జీవితంలో పాకిస్థాన్ కు సేవలందించినందుకు గర్వంగా ఉందన్నాడు. 2010 లో టెస్ట్ క్రికెట్ నుంచి బయటకు వచ్చిన ఆఫ్రిది..2011 లో జరిగిన వరల్డ్ కప్ కు పాక్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సెమీ ఫైనల్స్ చేరిన సంగతి తెలిసిందే.