కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)2021లో సోమవారం క్వెట్టా గ్లాడియేటర్స్, లాహోర్ క్యూలాండర్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్యూలాండర్స్ గ్లాడియేటర్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (40 బంతుల్లో 68 పరుగుల)తో టాప్ స్కోర్‌రగా నిలవగా.. కెప్టెన్ సర్ఫరాజ్ 40 పరుగులతో రాణించాడు. అనంతరం క్యూలాండర్స్ బ్యాట్స్‌మన్ మహ్మద్ హఫీజ్( 33 బంతుల్లో 73 పరుగులు; 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విజృంభించడంతో లాహోర్ క్యూలాండర్స్ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ 52 బంతుల్లో 82 పరుగులతో రాణించాడు.
కాగా మ్యాచ్ అనంతరం మహ్మద్ హఫీజ్, క్రిస్ గేల్ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది. హఫీజ్ మెరుపు బ్యాటింగ్‌ను మెచ్చుకుంటూ.. 'నీకు ఇంత బలం ఉందా.. లేక నీ బ్యాట్‌కేమైనా పవర్స్ ఉన్నాయా? బంతిని అంత బలంగా బాదావు.. నీ ఇన్నింగ్స్ సూపర్ 'అంటూ గేల్ ప్రశంసించాడు. దీనికి హఫీజ్ స్పందిస్తూ.. 'థ్యాంక్యూ గేల్.. కానీ నీలాగా నాకు కండలు లేవు. ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే నీకంటే వేగంగా ఆడాలనే లక్ష్యాన్ని మాత్రమే పెట్టుకొని బరిలోకి దిగాను. ఆ తర్వాత నా చేతి నుంచి సిక్సర్లు, ఫోర్లు జాలువారాయి. కానీ ఒకటి మాత్రం నిజం.. నీలాగా మాత్రం ఎప్పటికి బ్యాటింగ్ చేయలేను' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: నాలుగు రోజులు లేటైంది..లేకపోతే కోట్లు పలికేవి!
Comments
Please login to add a commentAdd a comment