ఆసీస్ బౌలర్ల ధాటికి పాక్ విలవిల
Published Fri, Dec 16 2016 4:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
హైదరాబాద్: బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న మొదటి టెస్టులో ఆసీస్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాట్స్‌మన్‌లు విలవిలలాడిపోయారు. పాక్ తన తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సమీ అస్లామ్ 22, బాబర్ ఆజామ్ 19, సర్ఫరాజ్ అహ్మద్ 20 పరుగులు చేశారు. మిగతా వాళ్లంతా ఒక అంకె స్కోరుకే పరిమిత మయ్యారు. ఆసీస్ బౌలర్లలో హజల్‌వుడ్‌కు 3, బర్డ్‌కు 2, మిచెల్‌స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి.
పాకిస్థాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. సర్ఫరాజ్ (31 బ్యాటింగ్), ఆమిర్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు అస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 130 పరుగులు, హ్యండ్స్‌కోంబ్ 105 పరుగుల, రెన్‌షా 71 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఆమిర్ 4, రియాజ్ 4, యాసిర్ షా 2 వికెట్లు తీశారు.
Advertisement
Advertisement