మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను మట్టికరిపించారు.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్ల అరుదైన క్లబ్‌లో చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో లియోన్ సహా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519) లియోన్ కంటే ముందు 500 వికెట్ల క్లబ్‌లో చేరిన వారిలో ఉన్నారు.
FIVE HUNDRED! #AUSvPAK #PlayOfTheDay @nrmainsurance pic.twitter.com/DyDC5hUdTJ
— cricket.com.au (@cricketcomau) December 17, 2023
సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ లెజెండరీ క్లబ్‌లో చేరాడు. 36 ఏళ్ల లియోన్ 123 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి ఆసీస్ తరఫున ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్‌కు ముందు వార్న్, మెక్‌గ్రాత్ ఆసీస్ తరఫున 500 వికెట్ల క్లబ్‌లో చేరారు. లియోన్ తన 500 వికెట్ డీఆర్‌ఎస్‌కు వెళ్లి సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2) సాధించిన లియోన్ ఆసీస్ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు.
Nathan Lyon is an All-time legend of Test cricket. 🫡 pic.twitter.com/qjP4wYv5lg
— Johns. (@CricCrazyJohns) December 17, 2023
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment