బాబర్‌ ఖాతాలో మరో రికార్డు.. కోహ్లిని వెనక్కు నెట్టి చరిత్ర సృష్టించిన పాక్‌ కెప్టెన్‌ | T20 World Cup 2021: Babar Azam Becomes Quickest To Reach 2500 T20I Runs | Sakshi
Sakshi News home page

T20 WC 2021 PAK Vs AUS: కోహ్లిని వెనక్కు నెట్టి చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌

Published Thu, Nov 11 2021 10:15 PM | Last Updated on Thu, Nov 11 2021 10:15 PM

T20 World Cup 2021: Babar Azam Becomes Quickest To Reach 2500 T20I Runs - Sakshi

Babar Azam Becomes Quickest To Reach 2500 T20I Runs: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో సైమీ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 2500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో బాబర్‌.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని సైతం అధిగమించాడు. బాబర్‌ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లో 2500 పరుగుల మైలరాయిని చేరుకోగా.. కోహ్లి 68 ఇన్నింగ్స్‌ల్లో, ఆసీస్‌ టీ20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 78 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు. 


ఆసీస్‌తో మ్యాచ్‌లో బాబర్‌ 39 పరుగులు చేసి వెనుదిరిగగా.. మహ్మద్‌ రిజ్వాన్‌(52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫకర్‌ జమాన్‌(32 బంతుల్లో 55 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకాలతో రాణించడంతో పాక్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనలో ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అయితే డేవిడ్‌ వార్నర్‌(16 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్‌), మిచెల్‌ మార్ష్‌(20 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్‌) ఆసీస్‌ను ఆదుకున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 52/1. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ గెలవాలంటే 84 బంతుల్లో 125 పరుగులు చేయాల్సి ఉంది.  
చదవండి: T20 WC 2021: జట్టు ఏదైనా సరే.. పాక్‌ను ఓడించడం అసాధ్యం..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement