
Impossible To Beat Pakistan Says PCB Cheif Ramiz Raja: టీ20 ప్రపంచకప్-2021లో వరుస విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ రమీజ్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. మెగా టోర్నీలో భాగంగా ఇవాళ(నవంబర్ 11) ఆసీస్‌తో కీలక సమరానికి ముందు జట్టు సభ్యులను ఉత్తేజపరుస్తూ ఓ వీడియా సందేశాన్ని రూపొందించి పీసీబీ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. పాక్ జట్టు ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. ప్రపంచంలో ఏ జట్టునైనా మట్టికరిపించగలదని ధీమా వ్యక్తం చేశాడు.
Play with pride and passion!
— Pakistan Cricket (@TheRealPCB) November 10, 2021
PCB chairman Ramiz Raja has a special message for Babar Azam's team. #WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/fS0rghZ4nG
జట్టు సభ్యులందరూ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా కలిసి కట్టుగా ఆడుతున్నారని, నాయకుడు బాబర్ ఆజమ్ జట్టును అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నాడని కొనియాడాడు. తాను కూడా మూడు ప్రపంచకప్‌లు ఆడానని, ఓ ఆటగాడికి ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఆడే అనుభవం వేరుగా ఉంటుందని అన్నాడు. పాక్ జట్టు ఇప్పటివరకు అద్భుతంగా రాణించిందని, మూడు ప్రపంచకప్‌లు ఆడిన అనుభవంతో చెబుతున్నాను.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్ధి ఎవరైనా పాక్‌ను ఓడించడం అసాధ్యమంటూ బాబర్ సేనను ఆకాశానికెత్తాడు. కాగా, రమీజ్.. పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాక్ ప్రపంచకప్ జట్టులో కీలక మార్పులు చేసిన విజయంతమైన సంగతి తెలిసిందే.
చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన
Comments
Please login to add a commentAdd a comment