T20 World Cup 2021: Brutal Trolls On Hasan Ali After Pakistan Lost World Cup Semis - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: మొన్న షమీ, కోహ్లి.. ఇప్పుడు హసన్‌ అలీ

Published Fri, Nov 12 2021 2:12 PM | Last Updated on Fri, Nov 12 2021 6:28 PM

T20 World Cup 2021: Hasan Ali Trolled Mercilessly After Pakistans Exit Out Of Tourney - Sakshi

Hasan Ali Trolled For Dropping Matthew Wade Catch: టీ20 ప్రపంచకప్-2021 సూపర్‌-12లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి, అజేయ జట్టుగా సెమీస్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్‌కు నవంబర్‌ 10న ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో శృంగ భంగమైంది. పాక్‌ 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో కూడా ఆఖరి వరకు పాక్‌కు తిరుగులేదనిపించినా.. హసన్‌ అలీ చేసిన ఒకే ఒక్క పొరపాటు పాక్‌ కొంపముంచింది. షాహీన్ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర హసన్ ఆలీ జారవిడిచాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదిన వేడ్.. మరో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ నేపథ్యంలో హసన్‌ అలీ.. గతంలో(పాక్‌ చేతిలో భారత్‌ ఓడిన సందర్భంగా) టీమిండియా ఆటగాళ్లు మహ్మద్‌ షమీ, విరాట్‌ కోహ్లిల మాదరే దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ట్రోలింగ్‌ మరింత శృతి మించిపోయింది. పాక్‌ ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ అభిమానులు.. భారతీయురాలైన హసన్‌ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. 

మరోవైపు, హసన్ ఆలీ కీలక సమయంలో క్యాచ్ డ్రాప్ చేయడమే మ్యాచ్‌ టర్నింగ్ పాయింట్ అని స్వయానా పాక్ కెప్టెనే అభిప్రాయపడడంతో జట్టు సభ్యులెవరూ అతనికి మద్దతుగా నిలిచే ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే, హసన్‌ అలీపై జరుగుతున్న ఈ ఆన్‌లైన్‌ దాడిని భారత నెటిజన్లు మాత్రం ఖండిస్తున్నారు. హసన్ ఆలీకి భరోసా ఇస్తూ ‘IND stand with Hasan Ali’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా, భారత్‌కు చెందిన సమీయా అర్జోని హసన్‌ అలీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమీయా అర్జోతో పాటు సెమీస్‌లో ఒక్క పరుగుకే ఔటైన షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాను సైతం పాక్‌ అభిమానులు టార్గెట్‌ చేస్తున్నారు. 


చదవండి: ఆసీస్‌తో కీలకపోరుకు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. ఫైనల్లో ఇక కష్టమే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement