పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగులతో పాక్‌ను ఇంగ్లీష్ జట్టు చిత్తు చేసింది. 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది.
దీంతో మసూద్ సేన ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
బ్రూక్, రూట్ విధ్వంసం..
అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌ను ఇంగ్లీష్ జట్టు 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్, జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో మెరిశారు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 454 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్(151), సల్మాన్(104), షఫీక్(102) సెంచరీలతో చెలరేగారు. ఏదమైనప్పటకి పాక్ ఓటమి పాల్వడంతో వారి సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment