టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో రూట్ చెలరేగాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామం మారిన ముల్తాన్ పిచ్‌పై రూట్ దుమ్ములేపుతున్నాడు.
305 బంతుల్లో 14 ఫోర్లతో రూట్ తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రూట్‌కు ఇది ఆరో టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం 203 పరుగులతో రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో హ్యారీ బ్రూక్(174) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.
సచిన్ రికార్డు సమం..
ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో మెరిసిన ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో ఏడో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి కేన్ విలియమ్సన్, ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, యూనిస్ ఖాన్ సరసన రూట్ నిలిచాడు.
ఈ దిగ్గజాలు కూడా టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్(12) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధాన్లాలో కుమార సంగర్కర(11), లారా(9) కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment